ఢిల్లీ ఎన్నికల ఫలితాల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరోసారి హస్తిన పీఠాన్ని సామాన్యుడు అధిరోహించబోతున్నాడు. హోరాహోరిగా జరిగిన పోరులు ఢిల్లీ ప్రజలు ఆమ్‌ ఆద్మీ వైపే నిలిచారు. అభివృద్ధి మంత్రంతో ప్రజలు ముందుకు వచ్చిన చీపురు పార్టీ జాతీయ పార్టీలను ఢిల్లీ వీదుల్లోంచి ఊడ్చేసింది. బీజేపీ గత ఎన్నికల కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించి పరవాలేదనిపించగా కాంగ్రెస్‌ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకోపోయింది. సుధీర్ఘ కాలంగా పాటు ఢిల్లీ అసెంబ్లీపై ఎగిరిన కాంగ్రెస్‌ జెండా ఈ సారి అసలు కనిపించకపోవటం ఆ పార్టీకి పెద్ద నష్టమనే చెప్పాలి.

 

ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఢిల్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ పార్టీ అధికారంలో లేకపోవటంతో కేవలం కేంద్ర పథకాలతో పాటు దివ్యమైన భవ్యమై న రామ మందిరం త్వరలోనే నిర్మిస్తామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. ఎన్సార్సీ, సీఏఏ వివాదాల నేపథ్యంలో హిందు ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశాభావం బీజేపీ వర్గాల్లో ఎన్నికల ముందు కనిపించింది.

 

కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మతం కార్డు పెద్దగా పనిచేయలేదు. ప్రజలు అభివృద్ధి మంత్రానికే పట్టం కట్టారు. స్కూల్స్‌, హాస్పిటల్స్‌, ప్రజారవాణా ఆధునీకరణ లాంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రయోగించిన కేజ్రీవాల్‌ ప్రజల మసను గెలుచుకున్నాడు. ఆలయాల నిర్మాణం అవసరమే అయినా ప్రజల ప్రధాన అవసరాలైన విధ్య, వైద్యం, ప్రజా రవాణా, నీళ్లు లాంటి అవసరాలు తీర్చే వారికే సామాన్య జనాలు మద్ధతు పలికారు.

 

ఇప్పటికే ఢిల్లీ గద్దెనెక్కి నాయకుడి విషయంలో క్లారిటీ వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల చిత్తుగా ఓడించి అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ఢిల్లీ పీటం మీద జెండా పాతనున్నాడు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ ఓటు శాతం గణనీయం పెరగట అనేది ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: