చైనాలోని ఊహ నగరంలో గుర్తించబడిన ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. చైనా వ్యాప్తంగా శరవేగంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకుతుంది.  ఇప్పటికి వెయ్యి మందికి పైగా ఈ మాయదారి ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 40 వేల మందికి పైగా కరోనా  వైరస్ బారినపడి ప్రాణ  భయంతోనే బతుకు పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్కు ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు  కూడా లేకపోవడంతో ఈ వైరస్ సోకింది అంటే ప్రాణం పోవడం ఖాయం గా మారిపోయింది. ఇక చైనాతో పాటు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అందరూ ఈ మాయదారి వైరస్కు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. 

 


 అయితే ఒక్క చైనా దేశమే  కాదు ప్రపంచ దేశాలను కూడా ఈ వైరస్ బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు తమ దేశ పరిధిలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లో కి కరోనా  వైరస్ ప్రవేశించి ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే భారతదేశంలో కూడా కరోనా వైరస్ గుర్తించబడింది  కేరళ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా  వైరస్ కు సంబంధించి మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక పలుచోట్ల కరోనా  అనుమానితులు కూడా ఎక్కువ అవుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం కరుణ పై సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. 

 

 ఈ క్రమంలో జరుగుతున్న ఓ ప్రచారం కోళ్ళకి కరోనా సోకిందని దీంతో చికెన్ తింటే అందరికీ కరోనా  వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా  వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చికెన్ తినకూడదు అని సోషల్ మీడియాలో ప్రచారం అందరి పై ప్రభావం చూపుతుంది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం చికెన్ తినొచ్చు అంటూ .. నిర్ధారించింది. ఇప్పటివరకు కోళ్లకు  కరోనా  వైరస్ సోకినట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదని... కాబట్టి పౌల్ట్రీ కి సంబంధించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవచ్చు అంటూ సూచించింది. దీంతో చికెన్ తినాలా వద్దా అనే దానిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: