దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో  ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీ.. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఒక సామాన్యుడి పార్టీ ముందు... కేంద్రంలో దిగ్గజంగా ఉన్న బిజెపి పార్టీ ఎత్తులు ఎక్కడ సాగలేదు. మరోసారి సామాన్యుడు సత్తా ఏంటో నిరూపించి  కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆప్  పార్టీ మరోసారి చీపురు పట్టి ఢిల్లీలోని గులాబీ పువ్వులను  అన్నింటిని  ఉడ్చేసింది. దీంతో మరోసారి జాతీయ పార్టీలైన బీజేపీయేతర కాంగ్రెసేతర పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా  జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. 

 

 

 కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ముందుండి నడిపించి... తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అని ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఆప్  పార్టీల మధ్య ఒకానొక సమయంలో విద్వేష పూరిత ప్రసంగాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో  అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ పార్టీ... హస్తినలో కూడా అధికారం దక్కించుకోవాలని ఢిల్లీ పెద్దలందరూ బరిలోకి దిగి... ప్రయత్నాలు చేసింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఒంటరిగానే తన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో  ఆప్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు అందరూ బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపారు.  కానీ ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపారు ఓటర్లు. 

 

 

 గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు అన్ని  మారిపోయాయి.. ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ఢిల్లీ ఓటర్లకు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి  రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు కావాలి అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది  అని అర్థం అవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఒక సామాన్యుడి పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి పార్టీ ని ఓడించి  అది కూడా భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని... మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. కాగా ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ విజయోత్సాహంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: