నాయకులందు తెలుగుదేశం పార్టీ నాయకులు వేరయా అన్నట్టుగా ఇప్పుడు గత టిడిపి ప్రభుత్వం లో చోటుచేసుకున్న అక్రమాల పుట్టల గుట్టు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.  పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి వ్యవహారాలను చూసీచూడనట్టుగా వదిలి వేయడమే కాకుండా, మరింతగా వారిని ప్రోత్సహించిన టిడిపి అధినాయకత్వం ఇప్పుడు దానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో బెంబేలెత్తిపోతోంది. పార్టీ పరువు నాయకుల పరువు బజారున పడేయడంతో పాటు, ఈ వ్యవహారాలన్నీ తన మెడకు చుట్టుకోవడం పై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన ఉన్నట్లుగా కనిపిస్తోంది.

 

అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే రంగంలోకి దిగిన సిఐడి, ఈడి ఐటి శాఖలు చేస్తున్న వరుస దాడులతో టిడిపి నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సందర్భంగా అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలు భారీ ఎత్తున ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఆయనకు సంబంధించిన సంస్థలపైనా ఐటీ దాడులు జరిగాయి. అంతకుముందు టిడిపి రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డికి చెందిన లా కళాశాలలో అక్రమాలు జరిగాయంటూ సెంట్రల్ విజిలెన్స్ దాడులు చేసి కేసులు నమోదు చేసింది.

 

అలాగే ఇదే జిల్లాకు చెందిన టిడిపి మైదుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ కు సంబందించిన ఆస్తి పాస్తులపైనా దాడులు చేపట్టింది. ముఖ్యంగా గత ఎన్నికలలో టిడిపికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన సీఎం రమేష్ ఇంటి పైన గతంలో ఐటి దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఇల్లు, కార్యాలయాల నుంచి ఐటీ శాఖ అధికారులు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి రక్షణ పొందేందుకు బిజెపిలో చేరి పోయారు అనే విమర్శలు కూడా వచ్చాయి.

 

 అలాగే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సీఎం రమేష్ బాటలోనే వెళ్ళిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు వ్యవహారాలను దర్యాప్తు సంస్థలు తవ్వి తీస్తుండడంతో ఆందోళన తెలుగుదేశం అధినాయకత్వం ఉంది. చంద్రబాబు పీఎస్ పైనా, లోకేష్ సన్నిహితుడైన కిలారి రాజేష్ అక్రమాలను వెలుగులోకి తేవడంతో పాటు కీలక ఆధారాలు  దర్యాప్తు సంస్థలు సంపాదించడంతో పాటు  రాష్ట్రం మొత్తం అక్రమాలు తీసేందుకు సిఐడి రంగంలోకి దిగడంతో పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు ఎక్కడ జంప్ అయిపోతారో అన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి. 

 

ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అవుతుందనే ఆందోళన చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలు ఆధారాలతో సహా బయటపడుతుండడంతో చంద్రబాబు  ఈ వ్యవహారాలన్నీ తన మెడకు చుట్టుకుంటాయనే ఆందోళన బాబు లో ఎక్కువ కనిపిస్తోంది.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నిత్యం టెన్షన్ లో ఉన్నారు టీడీపీ కీలక నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: