ఒకప్పుడు జంతువులను తింటూ బ్రతికి చైనా ప్రజల జీవితాలు ఇప్పుడు జంతువులకన్నా హీనంగా తయారైంది.. మనిషికి మనిషి దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయపడే పరిస్దితులు తలెత్తాయి..ఇన్నాళ్ల ఆ ప్రేమలు, ఇప్పుడు అంటరానివిగా మారాయి.. ఏదిపడితే అది తిని, ఇప్పుడు ఏది తినాలో తెలియని పరిస్దితుల్లో అక్కడి ప్రజలు దయనీయ స్దితిలో బ్రతుకుతున్నారు.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

 

 

దీనికంతటికి కారణం ఇప్పుడు చైనాను పట్టిపీడిస్తున్న కరోనా అనే రాక్షాసుడు. ఇప్పటికే ఎన్నో వందల ప్రాణాలను బలితీసుకున్నాడు. ఇంకా తీసుకుంటున్నాడు. కనీసం ఒక తల్లి తన బిడ్దకు కడుపునిండా చనుబాలు పట్టలేని పరిస్దితి, ఒక తండ్రి తన పిల్లలను ప్రేమారా హత్తుకోని దుస్దితి. అందరి మధ్య తిరుగుతున్న వారంత ఒంటరి వారు అయ్యారు..   ఇప్పుడు అనిపిస్తుంది ఓమనిషి ఇన్నాళ్లూ నువ్వు విజ్ఞానానికి నిధి అని మురిసిపోయావు.. ఎడతెగని అన్వేషణకి సిసలైన నిర్వచనాన్ని నేనని చాటావు. ఇప్పుడు ఏమైంది నీ మేధస్సు. ఒక్క సారిగా కబళించిన మృత్యువు వికృత తాండవం చేస్తుంటే కళ్లప్పగించి చూస్తూన్నావే గాని ఆ కరోనా మెడలను వంచలేక పోతున్నావు..

 

 

ఇన్నాళ్ల నీ కృషి ఇదేనా.. నువ్వు సాధించిన మేధస్సు వట్టి భ్రమేనా అనిపిస్తుంది... అని ఎవరికి వారు ప్రశ్నించు కుంటున్నారు.. ఇకపోతే ఇప్పుడు చైనా ప్రజల పరిస్దితిని చూస్తే మానవత్వం ఉన్న వారికి కన్నీళ్లు ఆగవు.. ఎందుకంటే చైనా ప్రభుత్వం కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ వైరస్‌కు సంబంధించి చిన్న లక్షణం కనిపించినా.. వారిని ‘కరోనా’ అనుమానితులుగా భావించి ఎత్తుకెళ్తున్నారు. లేదా బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తున్నారు.

 

 

అంతే కాకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించని అనుమానితులను బలవంతంగా లాక్కెళ్లి మరీ హాస్పిటళ్లలో చేరుస్తున్నారు. ఇకపోతే అందరు కలిసి ఉంటున్న ఇంట్లో ఒక్కరిలో ఆ లక్షణం కనిపించినా మొత్తం కుటుంబానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే, సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియో. ఇక బాధితులు తాము హాస్పిటల్‌కు రాబోమని కేకలు పెడుతున్నా.. పోలీసులు వాళ్లను బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: