దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అటు కేంద్రంలో కూడా బీజేపీ చక్రం తిప్పుతున్నప్పటికీ ఢిల్లీలో మాత్రం సత్తా చాట లేకపోతుంది బిజెపి పార్టీ. ఢిల్లీ పెద్దలు మొత్తం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించినప్పటికీ హస్తిన ప్రజలు మాత్రం కేజ్రీవాల్ వైఫై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గత రెండు ఎలక్షన్ లో నుంచి... బిజెపి పార్టీ ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకొడానికి  చేయని ప్రయత్నం లేదు అమలు చేయని వ్యూహము లేదు.. కానీ కేజ్రీవాల్ మాత్రం ఒంటరిగా పోరాటం చేస్తూనే అధికారాన్ని దక్కించుకున్నారు. మళ్లీ మాకు కేజ్రీవాల్ ప్రభుత్వం కావాలని ఢిల్లీ ప్రజలు అందరూ ముక్తకంఠంతో చెబుతూ ఏకపక్షంగా ఓట్లు వేస్తూ మళ్లీ మళ్లీ కేజ్రీవాల్ ను గెలిపిస్తున్నారు. 

 

 

 తాజాగా  జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే జరిగింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కాగా కేజ్రీవాల్ పార్టీ  ఘన విజయాన్ని సాధించింది. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ ప్రభుత్వం కనీస మెజారిటీ స్థానాలను కూడా దక్కించుకోలేక పోయింది. అయితే మరోసారి హస్తినలో అధికారాన్ని చేజిక్కించుకుని హాట్రిక్ సాధించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ విజయం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అందరూ మోడీ సర్కార్ పై సెటైర్లు వేస్తున్నారు. 2024 సంవత్సరంలో నరేంద్ర మోదీ కి పోటీ కేజ్రీవాలే అని అంటున్నారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. 

 

 

 2014 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా హర్యానాలో  నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని బిజెపి కి భారీ షాక్ ఇచ్చింది.. ఒక లోకల్ పార్టీ వేరే రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో... అప్పట్లోనే కేజ్రీవాల్ కేంద్ర రాజకీయాల్లో కి వెళ్తారూ  అని అందరూ అనుకున్నారు... ఇక ఇప్పుడు మరో సారి హ్యాట్రిక్ సాధించడం చూస్తుంటే... 2024 లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో మోదీ కి పోటీ గా నిలబడేది  కేజ్రీవాలే అని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా కేజ్రీవాలే కొనసాగుతారని.. అన్ని పార్టీల అధినేతలు కలిసి కేజ్రివాల్ నే  తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుని  మోదీకి ప్రత్యర్థిగా నిలబెడతారు అంటూ ఆ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. 2024 లో కేజ్రీవాల్ మోదీ ని ఓడించి ప్రధాని కావడం ఖాయం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: