ప్రాంతీయ పార్టీల జోరు ముందు రోజు రోజుకూ జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో కనిపించకుండా పోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలు ఎంతగా సత్తా చాటినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ప్రజలందరూ ప్రాంతీయ పార్టీల వైపు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పినప్పటికీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం... సత్తా చాటలేక  పోతున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు ఎన్నో రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలి లేక చతికిలబడి పోయాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో అయితే జాతీయ పార్టీల ఊసేలేదు. అయితే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల జోరు ముందు  సత్తా చాటలేకపోతున్నాయ్ అని  చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలుఉన్నాయి... అవే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల. 

 

 

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి పార్టీలు తమా ఉనికిని చాటుకోవడానికి ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ముందు మాత్రం నిలవలేక పోయాయి... కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలకు. దీంతో ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు కేవలం మాటలకే  మాత్రమే పరిమితం అయిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ మేము అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప... కనీస సీట్లు కూడా గెలిచిన దాఖలాలు లేవు. అటు మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి అయితే అసలు పార్టీ ఉందా లేదా అనే స్థితిలో ఉంది. 

 

 

 ఇక ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో.. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన  రాష్ట్రంలో... కేంద్రంలో చక్రం తిప్పుతున్న జాతీయ పార్టీ అయిన బీ జె పీ సత్తా చాటు లేకపోయింది. అక్కడ లోకల్ పార్టీ వరుసగా మూడుసార్లు అధికారాన్ని దక్కించుకొని హవా నడిపిస్తోంది. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి అయితే... ఎక్కడో మూలన రెండు మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీలు చూపిస్తున్న జోరు ముందు.. జాతీయ పార్టీలు తుస్సు మంటున్నాయి. కేంద్రంలో ఎంత చక్రం తిప్పినప్పటికీ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్ముతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాయి  జాతీయ పార్టీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: