`భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో నిర్మించబోతున్నాం. 10 వేల ఎకరాల భూమిని రంగారెడ్డి జిల్లాలో సేకరించాం. రైతుల ఆశీర్వాదంతో ప్రాజెక్టుకు భూసేకర చేపట్టాం. మరో రెండు వేల ఎకరాలను సేకరించి అతి త్వరలోనే ఫార్మా సిటీని రూపొందించబోతున్నాం`` అని తెలంగాణ ప్ర‌భుత్వ పారిశ్రామిక విధాన‌మైన టీఎస్ఐపాస్‌కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు. అయితే, కేటీఆర్ ప్ర‌పంచ స్థాయి క‌ల‌కు ఆదిలోనే బ్రేకులు వేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

 


ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ మేర‌కు కీల‌కు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి (ముచ్చర్లలో) ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి అనుమతులు రద్దు చేయాలని ప్రధాని మోడీకి,ప్రకష్ జవదేకర్‌లకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ రాశారు. ``తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన పేరుతో 3వేల ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తుంది. ఫార్మాసిటీని 3000 ఎకరాలను నుండి 19,333 ఏకరాలకు విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఫార్మా పరిశ్రమ వల్ల పర్యావరణం ,నీరు, భూమి,వాతావరణం కాలుష్యం అవుతాయి. ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి అంతకుడా వ్యవసాయానికి యోగ్యం మంచి పంటలు పండే భూములు. ఫార్మా సిటీతో కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉంది. దశబ్ధాలుగా హైదరాబాద్ నగరం పారిశ్రామిక కాలుష్యంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది.`` అని లేఖ‌లో పేర్కొన్నారు.

 

ఫార్మాసిటీ భూ అక్రమాలపై విచారణ చేయండని కోమ‌టిరెడ్డి కోరారు. `` రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మా సిటీ. వేల ఎకరాల భూ దందా చేస్తూ...పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. 8 లక్షలకు రైతుల వద్ద కొని కోటీన్నరకు ఫార్మా కంపెనీలకు అమ్ముతున్నారు.  19 వేల ఎకరాలు అవసరం లేదు. ఫార్మా తో కాలుష్యం ఖాయం. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్య మాయం అవుతాయి. ప్రకృతి సర్వ నాశనం అయితే అణగారిన వర్గాలకు తీవ్ర నష్టం. తక్షణం ఫార్మ సిటీని అడ్డుకోండి. భూ దందా మీద సమగ్ర విచారణ చేయండి. నిబంధనలకి విరుద్ధంగా చేపట్టిన ఫార్మా సిటీ అనుమతులు రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయండి`` అని ప్ర‌ధాన‌మంత్రికి, కేంద్ర‌మంత్రికి ఎంపీ కోమ‌టిరెడ్డి ఆ లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: