పార్టీ ఎందుకు ఓడిపోయిందని, కరకట్ట వద్ద ఉన్న ఇంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూర్చుని పార్టీ నేతలను అడిగితే ఎక్కువగా చెప్పిన మాట, మనకి సోషల్ మీడియాలో బలం లేదు కాబట్టి ఓడిపోయామని చెప్పారు. టీడీ జనార్ధన్, గల్లా జయదేవ్ వంటి వారు చంద్రబాబుకి ఇదే విషయం చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు, తనయుడు లోకేష్ ని పిలిచి అలా కాదు గాని, సోషల్ మీడియా మీద దృష్టి పెట్టమని చెప్పారు. చంద్రబాబు చెప్పడంతో వెంటనే లోకేష్ తన అర్మీని అప్రమత్తం చేసి సోషల్ మీడియా మీద దృష్టి పెట్టారు.



పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళను దగ్గర చేసుకుందామని చెప్తూ అసహనంగా ఉన్న వాళ్ళను దగ్గర చేసుకునే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టడం, వాళ్ళను ఫాలో అవడం చేసి కాస్త ఎన్నికల తర్వాత సందడి చేసారు. కార్యకర్తలు కూడా హా బాగానే ఉంది... మీకు కూడా ఇలాంటి అవకాశం రావాల౦టే ఎక్కువ పని చెయ్యాలని సూచించారు. అయితే ఇప్పుడు లోకేష్ మాత్రం సోషల్ మీడియాను పీక పిసికి చంపేస్తున్నారని టాక్. సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలకు పదవులు లేకపోయినా పార్టీని మోస్తూ ఉంటారు.



అలాంటి వారిని దగ్గర చేసుకోకుండా, పార్టీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ హడావుడి చేసే వాళ్లకు లోకేష్ పెద్ద పీట వేయడం, వాళ్లకు పిలిచి పదవులు ఇవ్వడం చేస్తున్నారు. స్వేచ్చగా పని చేసుకోండని ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేస్తే బాగుండేది గాని వాళ్ళను మొయ్యడం మొదలుపెట్టారు. దీనితో కొందరు హుషారుగా ఉండే కార్యకర్తలు మనకు గుర్తింపు రావడం లేదని బాధపడుతూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇది పార్టీలో చికాకుగా మారింది. మరి ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటకు వస్తారో...?  ఆ దేవుడికే తెలుసు అంటున్నారు టీడీపి అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: