ఏపీలో ఇప్పుడు ఉన్న‌త‌స్థాయి అధికారుల మ‌ధ్య జ‌రుగుతున్న సంభాష‌ణ‌లు ఆస‌క్తిగా మారాయి. తాజాగా ఇంటిలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల నేప‌థ్యం లో అధికారుల మ‌ధ్య ఈ విష‌యం చాలా ఆస‌క్తిగా మారింది. ఏ ఇద్ద‌రు అధికారులు మాట్టాడుకున్న ఇదే విష‌యం ప్ర‌స్థావ‌న‌కు రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏబీ వ్య‌వ‌హారం ఒక్క‌సారిగా రాజ‌కీయ రంగు పులుముకుం టోంది. ఆది నుంచి కూడా ఏబీ టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అనుకూల అధికారిగా ముద్ర ప‌డ్డారు. విజ‌య వాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌భుత్వ అండ చూసుకుని విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిం చార‌ని కోర్టు సైతం అప్ప‌ట్లో వ్యాఖ్యానించింది.

 

కేవ‌లం వైసీపీ నేత‌లే టార్గెట్‌గా ఆయ‌న కేసులు పెట్టారు. ఇలాంటి క్ర‌మంలో హైకోర్టు జోక్యంతో ఏబీని అక్క‌డ నుంచి త‌ప్పిన చంద్ర‌బాబు ఏకంగా ఇంటిలిజెన్స్ చీఫ్ చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీ కి అన్నివిధాలా అనుకూలంగా ప‌నిచేశార‌నేది వైసీపీ వాద‌న‌. మ‌రీ ముఖ్యంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యే లు పార్టీ మారి టీడీపీలోకి చేర‌డం వెనుక కూడా ఏబీ ఉన్నార‌నేది వైసీపీ విమ‌ర్శ‌. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం లో అప్ప‌టి విప‌క్షం వైసీపీ ఇచ్చిన ఆధారాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎన్నిక‌ల సంఘం కూడా ఏబీని త‌క్ష‌ణ‌మే మార్చేసింది. ఈ ప‌రిణామం ఊహించ‌నిది! ఒక ప్ర‌తిప‌క్షం చేసిన విమ‌ర్శ‌ల‌తో ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం కూడా ఇదే!

 

ఈ ప‌రిణామ‌మే ఏబీపై విమ‌ర్శ‌ల జ‌డిని పెంచింది. ఒక పార్టీకి అనుకూలంగా అతి చేస్తే.. ఏం జ‌రుగుతుం దో అదే జ‌రిగింద‌ని అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై ఓజాతీయ మీడియా క‌థ‌నాల‌ను కూడా రాసేసింది. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌లే దు. పైగా ఇప్పుడు ఆయ‌న కుమారుడి కోసం దేశ భ‌ద్ర‌త‌, రాష్ట్ర భ‌ద్ర‌త‌ల‌ను కూడా ఫ‌ణం పెట్టేందుకు ఏబీ సిద్ధ‌మ‌య్యార‌ని పేర్కొంటూ.. ఆయ‌న‌పై స‌స్పెన్స్ జారీచేసింది. అంతేకాదు, విజయ‌వాడ దాటి వెళ్ల‌రాద‌ని కూడా ఆదేశించింది. నిజానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న అధికారులు అతి చేస్తే.. అంతే గురూ! అని చ‌ర్చించుకుంటున్నారు.

 

ఏ అధికారికైనా పార్టీల ప‌ట్ల మ‌మ‌కారం ఉండొచ్చు.. అలాంటి స‌మ‌యంలో ప‌ద‌వులు వ‌దులుకుని రావ‌డ‌మే బెస్ట్‌.. అనేది గ‌తంలోను, ఇప్పుడు కూడా క‌నిపిస్తున్న వాస్త‌వాలు. మ‌రి ఈ విష‌యాన్ని విస్మ‌రిస్తే.. జ‌రిగేది ఇంతే క‌దా!  ఈ కేసు ఉంటుందా?  వీగుతుందా? అనే అంశాల‌ను ప‌క్క న‌పెడితే.. మొద‌ట అయితే, జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది క‌దా! అనేది అధికారుల మాట‌! ఏదేమైనా.. అధికారులు త‌మ త‌మ స్థానాల‌ను ప‌రిధుల‌ను గుర్తెరిగి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: