దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ వాదం అనే అంశంతో వెళ్ళిన కమలం పార్టీకి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. దాదాపు 60 చోట్ల అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ ఏకపక్ష విజయం సాధించింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే 2015 ఎన్నికలతో పోలిస్తే కమలం కాస్త గట్టి పోటీ ఇచ్చింది అనే చెప్పుకోవచ్చు. 27 స్థానాల్లో విజయలక్ష్మి దోదూచులాడినా, మధ్యతరగతి ప్రజలు కేజ్రివాల్ వైపు చూడటంతో విజయం ఆప్ ని వరించింది. ఇప్పుడు దీనిపై దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులు అన్నీ హ్యాపీ గా ఉన్నాయి.


హిందుత్వ ఓటు బ్యాంకు ని పెంచుకోవడానికి గానూ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్పీ వంటి వాటిపై దేశంలో ఎక్కువగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే దాదాపు 7 రాష్ట్రాలు ఆ రెండు చట్టాలను మా గుమ్మం కూడా తొక్కనిచ్చేది లేదని స్పష్టం చేస్తూ తీర్మానాలు చేసాయి. దక్షినాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆప్ అలా విజయం సాధిస్తుందని ఆమె అంచనాకు వచ్చారో లేదో అరవింద్ కేజ్రివాల్ కి ఫోన్ చేసారు.



ప్రజలు బిజెపిని తిరస్కరించారని, అభివృద్ధి ఆప్ ని గెలిపించిందని, పౌరసత్వ సవరణ చట్టం ని ప్రజలు ఛీ కొట్టారు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు. ఇక విజయంపై అరవింద్ కేజ్రివాల్ కి ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా చెప్పారు ఆమె. ప్రజలు అభివృద్దిని మెచ్చుకున్నారని ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. మిగిలిన రాష్ట్రాలు కూడా బిజెపిని తిడుతూ ఆప్ ని పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామం బిజెపికి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. అటు ప్రజల్లో కూడా బిజేపిపై ఏ స్థాయిలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా స్పష్టం చేసాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: