ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఊహించని విధంగా ఓటమిని చవి చూసింది. ఇన్నాళ్ళు జాతీయ వాదం అంటూ కబుర్లు చెప్పిన కమలం పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలోనే ఊహించని విధంగా షాక్ ఇచ్చారు అక్కడి ప్రజలు. తమకు తిరుగులేదని భావిస్తున్న మోడీషా ద్వయానికి దేశ రాజధానిలో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క రాష్ట్రంలో కూడా విజయం సాధించలేదు భారతీయ జనతా పార్టీ. మహరాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటి సాధించలేదు బిజెపి. ఆ తర్వాత హర్యానాలో జేజేపితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


మహారాష్ట్రలో శివసేన షాక్ ఇవ్వడంతో బిజెపి అధికారం కోల్పోగా, ఝార్ఖండ్ లో కూడా అధికారం కోల్పోయింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కమలాన్ని అరవింద్ కేజ్రివాల్ చీపురుతో ఊడ్చేసారు. ఇప్పుడు దీనిపై మన తెలుగు రాష్ట్రాలు ఫుల్ హ్యాపీ ఉన్నాయి. అవును తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు, కెసిఆర్ ఇప్పటికే కేజ్రివాల్ కి ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా చెప్పేశారు. అసలు దీనికి కారణం ఏంటీ అనేది చూద్దాం.



ఆంధ్రప్రదేశ్ కి గాని, తెలంగాణకు గాని బిజెపి పులిహోర కబుర్లు చెప్పడమే గాని ఎక్కడా బడ్జెట్ లో నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. దీనితోనే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు హ్యాపీగా ఉన్నాయి. తెరాస, టీడీపీ, వైసీపీ పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేసారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏదో గుజరాత్ అల్లర్ల కక్ష సాధింపు వలన ఇవ్వలేదు. ఇప్పుడు తమకు నచ్చిన, కోరుకున్న ప్రభుత్వాలే కదా రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు నిధులు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటీ...? అందుకే ఈ ముగ్గురు నేతలతో పాటు ఏపీ, తెలంగాణా ఫుల్ హ్యాపీగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: