ఒకప్పుడు బయట ఏదైనా ఆహారం తినాలి అనుకుంటే హోటల్కు వెళ్లి తినాల్సి వచ్చేది. హోటల్ లో పార్సెల్ తీసుకొని వచ్చి మనం ఇష్టమైన చోట తినే అవకాశం ఉండేది. ప్రస్తుతం రోజులు మారాయి టెక్నాలజీ పెరిగింది.. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే దొరుకుతుంది.. ఇక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ఎంతో శ్రమించాల్సి అవసరంలేదు... స్మార్ట్ ఫోన్ తీసి ఒక్క క్లిక్ చేస్తే చాలు... మనకి కావలసిన ఆహారం మన ముందు ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ఎవరు కూడా హోటల్ కి వెళ్లడం లేదు ఇలా ఆన్లైన్ ద్వారానే ఫుడ్  తెప్పించుకుంటున్నారు. అటు రోజురోజుకు ఆన్లైన్లో ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 

 

 

 ప్రస్తుతం ఏదైనా ఫుడ్ కావాలంటే ఎక్కువగా జనాలు స్విగ్గి యాప్  లోనే ఆర్డర్ చేస్తున్నారు. స్విగ్గి  ద్వారా ఆర్డర్  చేసిన కొంత సమయం లోనే ఫుడ్ డెలివరీ అవుతూ ఉంటుంది అని ఎక్కువగా నమ్ముతుంటారు. ఏ రెస్టారెంట్ నుంచి  ఆహారాన్ని కొనాలి అనుకుంటున్నారో... ఆ రెస్టారెంట్ నుంచి స్విగ్గి యాప్ ద్వారా కస్టమర్లు ఆహారాన్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం స్విగ్గి ఫుడ్ డెలివరీ యాప్ లలో  టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇకపోతే రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అటు  సైబర్ నేరగాళ్ల బెడద కూడా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ లో కూడా సైబర్ నేరగాళ్ల బెడతా ఎక్కువైపోతుంది. 

 

 

 ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్ తమ కస్టమర్లకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్ కేర్ స్కామ్ లపై  జాగ్రత్తగా ఉండాలంటూ తమ కస్టమర్లను  సూచించింది స్విగ్గి. స్విగ్గి  ప్రతినిధులు అని ఎవరైనా కాల్ చేస్తే నమ్మొద్దని  వ్యక్తిగత సమాచారాన్ని అడిగినప్పుడు వారికి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వద్దు అంటూ సూచించింది.స్విగ్గి  నుంచి కస్టమర్లకు ఎలాంటి ఫోన్ కాల్స్  రావని... అంతే కాకుండా కస్టమర్లు కూడా గూగుల్ లో స్విగ్గి  నెంబర్లు చూసి ఫోన్ చేసి మోస పోకూడదు అని తెలిపింది. యాప్ లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ తో మాత్రమే స్విగ్గి  ప్రతినిధులను సంప్రదించాలని సూచించింది స్విగ్గి.

మరింత సమాచారం తెలుసుకోండి: