ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల అంశం గత రెండు నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఈ రాజధానులు కారణంగా రాజకీయాలలో ఎన్నో సంభవించాయి.. మూడు రాజధానులతో ఆంధ్రని అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే.. ప్రతిపక్షాలు ఆ నిర్ణయంపై కూడా విమర్శలు చేసి.. ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. 

                      

అలాంటి మూడు రాజధానుల అంశంలో ఈరోజు సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పథ్నాలుగు రోజులు ముగిసినందున ఇక రెండు బిల్లులు ఆమోదం పొందినట్లేనని అయన తెలిపారు. బిల్లుల విషయంలో సభ ముందు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి అని.. అవి ఆమోదించడం, తిరస్కరించడం, సెలెక్ట్ కమిటీకి పంపడం మాత్రమే అని పిల్లి సుభాష్ తెలిపారు. 

                   

అయితే ఈ మూడు ఆప్షన్లు కూడా 14 రోజుల్లో చేయలేకపోయినందున సీఆర్డీఏ రద్దు బిల్లులు, అధికార వికేంద్రీకరణ బిల్లులు ఆమోదింపబడినట్లేనని మంత్రి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీ నియామకం జరగకపోవడంతో ఈ రెండు బిల్లుల్ని గవర్నర్ వద్దకు పంపి ఆమోదింప చేస్తాం అని పిల్లి సుభాష్ చెప్పుకొచ్చారు. 

                          

అంతేకాదు.. ఈ మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్ష పార్టీలు చాలా దారుణంగా ప్రవర్తించాయి.. ప్రవర్తిస్తున్నాయి.. ఇప్పటికి రాజధాని రైతలను.. ప్రజలను రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు.. ఎన్నో కామెడీ స్పీచ్ లు ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులూ ఇచ్చే కామెడీ స్పీచ్ లు చూస్తే సినిమాలలో కమెడియన్లు కూడా ఆలా కామెడీ చెయ్యరు అని నెటిజన్లు అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: