చలమలశెట్టి సునీల్...రాజకీయాల్లో అవకాశాలు వచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుని నష్టపోయిన దురదృష్టవంతుడు. సమాయనుకూలంగా పార్టీల్లో ఉండకుండా పార్టీలు మారి రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్ధకం చేసుకున్న నాయకుడు. కాపు నాయకుల్లో మంచి పేరున్న సునీల్ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి దిగారు. ఇక ఆ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో సునీల్ దాదాపు 2 లక్షల 90 వేలు ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు.

 

కానీ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం, వైసీపీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కూడా కనుమరుగు కావడంతో, వైసీపీలోకి వెళ్లారు. ఆ పార్టీ తరుపునే 2014 ఎన్నికల్లో మళ్ళీ అదే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేవలం 3431 ఓట్ల తేడాతో అప్పటి టీడీపీ అభ్యర్ధి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఏదో దురదృష్ఠం కొద్ది ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

 

సరే ఓడిపోతే ఓడిపోయాం, ఇక నుంచైనా కష్టపడితే మంచి ఫలితం అందుకోవచ్చని ప్రయత్నాలు చేయాలసిన సునీల్‌కు దరిద్రం టీడీపీ రూపంలో ఎదురైంది. వైసీపీలో ఉండి జగన్‌కు అండగా నిలబడితే మంచిగా ఉండేది. కానీ అలా చేయకుండా 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఇక ఆ పార్టీ తరుపునే కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. ఇక మనోడికి ఎలాగో దురదృష్టం పక్కనే ఉంటుంది కాబట్టి, టీడీపీ నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్ధి వంగా గీతా చేతిలో 25 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఈ విధంగా ఇన్నిసార్లు సునీల్‌ని దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది.

 

ఇక ఈ దురదృష్టం నుంచి తప్పించుకునేందుకు సునీల్...ప్రస్తుతం అధికార వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీలో ఉన్న తన సన్నిహితులు ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరి జగన్, సునీల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ వేస్తారో? లేక రెడ్ సిగ్నల్ వేస్తారో? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: