చంద్రబాబునాయుడు వ్యూహాలు అవుడేటెడ్ అయిపోయాయా ? సోషల్ మీడియా ముందు చంద్రబాబు అస్త్రాలు పనిచేయటం లేదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి.  చంద్రబాబు అనుసరించే టెక్నిక్కులేమిటంటే ప్రత్యర్ధులపై బురద చల్లించటం. తమ మీద పడిన బురదతో దాన్ని కడుక్కోలేక ప్రత్యర్ధులు నానా అవస్తలు పడుతుంటారు. ఏదో ఓ రకంగా కడుక్కున్నామని అనుకోగానే మళ్ళీ మరో రూపంలో బురద చల్లేస్తుంటారు.

 

అయితే ఈ వ్యూహాలు బాగా పాతపడిపోయాయి. 2014 ఎన్నికల్లోనే చంద్రబాబు వ్యూహాలు ఎక్సైపయిరీ అయిపోయింది. తనకు మద్దతుగా నిలబడే మీడియాతో జగన్మోహన్ రెడ్డిపై మ్యాగ్జిమమ్ బురద చల్లించేశారు.  2014 తర్వాత  సోషల్ మీడియా చాలా స్పీడయిపోయింది. ఈ స్పీడు ముందు చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియాగా ముద్రపడిన రెండు దినపత్రికల సర్క్యులేషన్ మహా ఉంటే ఓ 16  లక్షలుంటుంది.

 

అదే సోషల్ మీడియా ఖాతాలను చూస్తే దాదాపు కోటి దాకా ఉంటుంది. అంటే రెండు దినపత్రికలు చదవే వారి సంఖ్య లక్షల్లో ఉంటే సోషల్ మీడియాను కోట్లమంది ఫాలో అవుతారు. దాంతో  సోషల్ మీడియా ముందు చంద్రబాబు వ్యూహాలు పనికిరాలేదు. దాని దెబ్బతోనే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి. ఓటమి తర్వాత నిజాయితీగా విశ్లేషించుకోవాల్సిన చంద్రబాబు మళ్ళీ జగన్ ప్రభుత్వంపై బురద చల్లించటం మొదలుపెట్టారు. ఆ బురద జగన్ కు అంటుకునే లోపే సోషల్ మీడియా అలర్టయిపోయి చంద్రబాబు మీదకే తిప్పి కొడుతోంది.

 

సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబు, టిడిపి నేతలే కాదు చివరకు ఎల్లోమీడియా కూడా కళ్ళు తేలేస్తోంది. ఇదే విషయం పార్టీలో కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.  జరుగుతున్న విషయాలు చూస్తుంటే చంద్రబాబు వ్యూహాలు ఎక్కడివక్కడ తేలిపోతున్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే చంద్రబాబు వ్యూహాలు అవుడేట్ అయిపోయాయా అనే అనుమానాలు పార్టీ నేతల్లోనే పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: