ప్రజల మేలు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని మొదట వ్యతిరేకించేదెవరో...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దానిపై రాజకీయం చేస్తూనే ఉన్నారు. జగన్‌కు కనీస సమయం ఇవ్వకుండా నెలరోజుల్లోపు నుంచే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు అధికారం కోల్పోయామనే బాధ కావొచ్చు, జగన్ మీద ఉన్న కోపం కావొచ్చు, ఆయన్ని వెంటనే దించేసి అధికారం లాగేసుకోవాలనే కసితో ముందుకెళుతున్నారు.

 

గత 8 నెలల కాలం నుంచి అదే పని చేస్తూ వస్తున్నారు. మొదట ఇసుక పేరుతో పోరాటాలు, తర్వాత రీటెండరింగ్‌పై బీదఅరుపులు, పి‌పి‌ఏల పై లొల్లి, ఇంగ్లీష్ మీడియంపై రచ్చ, సచివాలయ ఉద్యోగాలపై కుట్ర, రైతు భరోసా, అమ్మఒడిలపై విషప్రచారం ఇలా ప్రతి విషయంలోనూ రాద్ధాంతం చేశారు. ఇక అభివృద్ధి కోసమని తీసుకొచ్చిన మూడు రాజధానులపై రెండు నెలల నుంచి ఎంత రచ్చ చేస్తున్నారో కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు.

 

తన రియల్ ఎస్టేట్ కోసమని చెప్పి అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ, రోడ్లపైకి వచ్చి మరి జోలె పట్టుకుని హడావిడి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే బాబు మూడు ప్రాంతాల్లో జగన్‌పై నెగిటివ్ పెరగాలని టీడీపీ వర్గాల చేత ఓ విష ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. రాయలసీమలో హైకోర్టు వచ్చిన అక్కడ వారికి పెద్దగా ఉపయోగం లేదని, పైగా విశాఖపట్నం దూరమైపోతుందని, మొత్తం పెడితే కర్నూలులోనే రాజధాని పెట్టాలని చెప్పిస్తున్నారు.

 

ఇక ఇటు ఎలాగో కోస్తా జిల్లాల్లో అమరావతినే రాజధానిగా ఉంచాలని, మూడు రాజధానులు పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని మాట్లాడిస్తున్నారు.  అటు ఉత్తరాంధ్ర వచ్చేసరికి మరో ప్లాన్ చేయించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పేరుతో వైసీపీ నేతలు భూములు కొట్టేస్తున్నారని విషప్రచారం చేయిస్తున్నారు. మొత్తం మీద మూడు ప్రాంతాల్లో వివిధ రకాలుగా మాట్లాడిస్తూ..జగన్‌పై నెగిటివ్ వచ్చేలా చేయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: