బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి...అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువ నాయకుడు. కర్నూలు వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేత. అయితే ఇలా చాలా తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డిని సొంత పార్టీ వాళ్లే కాస్త తోక్కెసే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిసింది. త్వరగా క్రేజ్ రావడం కావొచ్చు, దూకుడు స్వభావం ఉండటం వల్ల కావొచ్చు బైరెడ్డిని పార్టీ నుంచి సైడ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

మామూలుగానే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్‌కు, బైరెడ్డికు పెద్దగా పడదనే విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆర్థర్ విజయానికి బైరెడ్డి కృషి చేశారనే విషయం కూడా తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల వెలువడిన దగ్గర నుంచి నియోజకవర్గంలో బైరెడ్డి వర్గానికి, ఆర్థర్ వర్గానికి అసలు పడటం లేదు. ఎమ్మెల్యే వర్గం వాళ్ళు అన్నీ విషయాల్లో డామినేట్ చేసేలా వ్యవహరించడం బైరెడ్డి వర్గానికి నచ్చడం లేదు. అటు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో బైరెడ్డి వర్గం కూడా ఎమ్మెల్యే  వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసింది.

 

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో బైరెడ్డి, ఆర్థర్‌లని పిలిచి జగన్ ఒకసారి క్లాస్ పీకారని కూడా సమాచారం. అయితే అక్కడ నుంచే బైరెడ్డిని సైడ్ చేసే కార్యక్రమం మొదలైందని కర్నూలు వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. కొందరు సీనియర్లు బైరెడ్డిని టార్గెట్‌గా పెట్టుకునే ఎదగనివ్వకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పైగా బైరెడ్డికి రావాల్సిన ఓ కీలక పదవిని కూడా రాకుండా చేశారనే టాక్ కూడా వచ్చింది. ఇంకా దూకుడు స్వభావం వల్ల పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వైసీపీ పెద్దలు కూడా బైరెడ్డిని దూరంగా పెడుతున్నట్లు తెలిసింది.  

 

ఇక ఈ విషయాలని తెలుసుకున్న బైరెడ్డి పలుమార్లు బహిరంగంగానే పార్టీలో జరిగే విషయాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ అయిదేళ్లలో మాత్రం బైరెడ్డికి పార్టీలో పెద్ద స్కోప్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరి చూడాలి బైరెడ్డి ఈ సమస్యలని ఎలా అధిగిమిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: