చైనాలోనే ఊహన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్  ప్రస్తుతం చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా ప్రజలందరూ ప్రాణభయంతో బతికేలా చేస్తుంది ఈ మాయదారి ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే చైనా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అధికారికంగా వెయ్యి మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా అనధికారికంగా ఈ సంఖ్య భారీగానే ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా 40 వేలకు మందికి పైగా ఈ కరోనా  వైరస్ సోకి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ఈ వైరస్ సోకితే మరణం ఖాయం గా మారిపోయింది. ప్రపంచదేశాల వైద్య నిపుణులు అందరూ ఈ  ప్రాణాంతకమైన వైరస్ కు విరుగుడు  కనిపెట్టేందుకు పరిశోధనల్లో నిమగ్నమయ్యారూ. 

 

 

 అయితే ఈ  వైరస్ విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలు  సకాలంలో ఫలించకపోతే   ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి 60 శాతం జనాభా చనిపోతారని  హాంకాంగ్కు చెందిన ఓ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ గాబ్రియల్ లియాంగ్  హెచ్చరించారు. ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా అన్ని  దేశాల్లో కలిపి నలభై మూడు వేల మందికి పైగా ఈ కరోనా  వైరస్ బారిన పడగా... చైనాలోనే  42 వేల మందికి ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా  వైరస్ సోకిన ప్రతి రోగి  ద్వారా రెండున్నర శాతం మందికి ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకే అవకాశం ఉందని తెలిపిన ఆయన... ఈ లెక్కన 60 నుంచి 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది అని తెలిపారు. 

 

 

 ప్రస్తుతం చైనాలో ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృతి చెందినవారి అసలైన సంఖ్య చైనా ప్రభుత్వం వెల్లడించడం లేదు అంటూ ఆరోపణలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండొచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ వైరస్ను గుర్తించేందుకు సరైన మెడికల్ కిట్లు తక్కువగా ఉండటం వల్ల లక్షలాది మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించ లేకపోతుంది చైనా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేవలం చైనాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలకు పెను ప్రమాదంగా మారింది ఈ ప్రాణాంతకమైన వైరస్. ఈ ప్రాణాంతకమైన వైరస్ కు త్వరగా వాక్సిన్ కనుగొనేందుకు  కృషి చేయాలనీ  ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి డాక్టర్ టెండ్రాస్ అథానమ్  పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: