ఒకరు తప్పు చేస్తే ఆ ఫలితం అందరు అనుభవిస్తారని ఇప్పుడు చైనాలో జరిగిన సంఘటన నిరూపిస్తుంది. రూపం లేకుండా, ముందస్తూ ప్రకటన లేకుండా సునామిలా బయటకు వచ్చిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు విల విల లాడిపోతున్నాయి. ఇక చైనా పరిస్దితి అయితే చెప్పనవసరం లేదు..ఎందుకంటే ఈ వైరస్ కారణంగా తాజాగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అంతే కాకుండా ఈ దేశంలో చాలా కంపెనీలు మూతపడగా మరి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

 

 

కాగా కరోనా అదుపులోకి వచ్చింది అని చెప్పుకుంటున్న చైనా దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేక పోతుంది.. ఇకపోతే తాజాగా కరోనా వైరస్ విస్తరించిన కారణంగా మళ్లీ 11 రాష్ట్రాల్లో సెలవులను పొడిగించారు. ఇదే కాకుండా దేశంలో ఉత్పత్తి అయ్యే వాహనాల్లో 75 శాతం ఈ రాష్ట్రాల్లోనే తయారవడంతో ఆటోమొబైల్ రంగం కుదేలైంది. 3.5 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీనివల్ల చైనాలో విడిభాగాలు వాహనాల కొరత తీవ్రంగా ఉండి నష్టం కోట్లలో వస్తోందట..

 

 

ఇక విమానయాన రంగం కూడా కుదేలైంది. హాంకాంగ్ ఎయిర్ లైన్స్ ఏకంగా 400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మిగలిన వారిని సెలవు పెట్టాలని సూచించిందట.. ప్రపంచంలోనే నంబర్ 2 విమానయాన సంస్థల్లో హాంకాంగ్ రెండోదిగా చెప్పబడుతుంది.. ఇదే కాకుండా చైనాలో పలు సంస్దలు కూడా మూతపడటానికి సిద్దంగా ఉన్నాయి.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం హ్యుండాయ్ వెహికల్ కాంప్లెక్స్ ను తాజాగా ఆ కంపెనీ మూసివేసింది. సంవత్సరంలో 14 లక్షల వాహనాలు తయారు చేస్తున్న, ఈ కంపెనీ కరోనా వైరస్ కారణంగా మూతపడటంతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు.

 

 

దాదాపు 25వేల మంది కార్మికులను సెలవులపై పంపారు. అంతే కాకుండా తమ ప్లాంట్ల ను కూడా మూసివేస్తున్నట్టు తాజాగా టయోటా సుజుకి కూడా తెలుపడంతో ప్రపంచ వ్యాప్తంగా కార్లు వాటి విడిభాగాల పంపిణీకి విఘాతం ఏర్పడింది. చైనాలో కరోనా వైరస్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడి ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.. ఇలాంటి సంఘటనల వల్ల ప్రపంచం ప్రమాదంలో పడబోతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి ఆర్ధిక పరిస్దితి చైనాలో తలెత్తితే చాల మంది బ్రతుకులు రోడ్దున పడుతున్నాయి. మరి ఈ విపత్తును ఎలా ఎదుర్కొటారో ...

మరింత సమాచారం తెలుసుకోండి: