సాధారణ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ  లో చేరి , ఆ తరువాత కన్పించకుండా పోయిన ఇద్దరు నాయకులు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ పార్టీకి చేరువ అవుతున్నట్లు కన్పిస్తున్నారు . అయితే వీరిద్దరి వల్ల ఇప్పుడు ఆ పార్టీకి ఎంతవరకుమేలు జరుగుతుందనేది  ప్రశ్నార్ధకంగా మారింది . ఇరువురు తమ, తమ ప్రాంతం లో సామాజికవర్గం లో కూడా బలమైన నేతలే అయినప్పటికీ ... తాము  వేసిన తప్పటడుగు వల్ల ప్రాభవం కోల్పోయి రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నవారే కావడం విశేషం . ఒకరు మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధాకృష్ణ కాగా , మరొకరు మాజీ ఎంపీ హర్ష కుమార్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇద్దరు నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు .

 

అయితే ఇరువురు ఎన్నికల్లో పోటీ చేయలేదు . రాధాకృష్ణ స్వచ్చందగా పోటీకి దూరం ఉండగా , హర్ష కుమార్ కు మాత్రం పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వలేదు . ఎన్నికల అనంతరం ఇద్దరు కూడా టీడీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు . ఒకవిధంగా చెప్పాలంటే ఆ పార్టీ తో తమకు ఎటువంటి సంబంధాలు లేవన్నట్లుగా అంటీముట్టనట్లే వ్యవహరించారు . అయితే జగన్ సర్కార్ తీసుకున్న  మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , ఈ ఇద్దరు నాయకులు మళ్ళీ తమ గళాన్ని వినిపిస్తున్నారు . ఈ ఇద్దరు నేతలు కలిసి  మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రావుపాలెం లో నిరసన ర్యాలీ నిర్వహించడం హాట్ టాఫిక్ గా మారింది .

 

ఈ ఇద్దరు నేతలను వెనుకుండి టీడీపీ నాయకత్వమే నడిపిస్తోందన్న వాదనలు లేకపోలేదు . ఎందుకంటే ఇద్దరు నాయకులకు తమ, తమ సామాజికవర్గాల్లో గట్టి పట్టుండమే కారణమని తెలుస్తోంది . అయితే గతం లో ఇద్దరికి తమ , తమ సామజిక వర్గాల్లో  ఉన్న పట్టు ఇప్పుడు లేదనే వాదనలు లేకపోలేదు . మరి ఈ ఇద్దరు టీడీపీ కి ఎంతవరకు మేలు చేస్తారో చూడాలి మరి . 

మరింత సమాచారం తెలుసుకోండి: