రాజకీయాలంటే గోడ మీది పిల్లులంటారు.. ఎటు అవసరం ఉంటే అటువైపు దూకుతారు కాబట్టి ఇలా చెప్పి ఉంటారు.. ఇకపోతే నిన్న మొన్నటి వరకు మోదీ జపం చేసిన మమత సడెన్‌గా ప్లేట్ ఫిరాయించారు.. ఇంతకు విషయం ఏంటంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే..

 

 

అయితే ఆప్ విజయానికి మమత నోరు తెరవడానికి ఉన్న సంబంధం ఇదే.. డిల్లీలో బీజేపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మమత తన మాటలను కమళం పై బుల్లెట్లలా కురిపించింది. అదేమంటే ఆప్ పార్టీని గెలిపించడం, కమళాన్ని వాడిపోయేలా చేయడం సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పని ఆమె పేర్కొన్నారు.

 

 

ఇదే కాకుండా. పశ్చిమ బెంగాల్లో 2021 లో జరిగే ఫలితాల్లో బీజేపీ ఇదే తీరున ఓటమి పాలవుతుందని, త్వరలోనే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం ఖాయం అని పేర్కొన్నారు. 2018 నుంచి పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు.

 

 

బీజేపీ వెదజల్లే డబ్బుకు మహిళలు, సోదరిలు పూరించే శంఖారావాలే బలమైన ఆయుధాలవుతాయని మమత అభివర్ణించారు. ఇక ముఖ్యంగా తమ రాష్ట్రంలో జరిగే ఎన్నికలతో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయో సమయం ఎంతో దూరం లేదని, ఆ పార్టీ శవపేటికపై దించే చివరి మేకు తమదేనంటూ సంచలనంగా మట్లాడారు...

 

 

ఇక అప్పుడు బీజేపీ అంత్యక్రియలను తామే నిర్వహిస్తా మన్నారు.. ఏది ఏమైనా మమతక్కా నీకేం అన్యాయం చేసాడని మోదీని ఇలా చెడా మడ వాయిస్తున్నావు.. మీకు మీకు మధ్య ఎన్నో జరిగి ఉండవచ్చూ. అయినంత మాత్రానా కమళాన్ని ఇలా కాకా పట్టడం సరికాదు అని కొందరు నాయకులు వెన కెనక అనుకుంటున్నారట..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: