అంతకుముందు వరకు బిజెపి పార్టీ అసలు ఎక్కడ కనిపించిన దాఖలాలు లేదు. కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా ఉండేది. కానీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రకటించిన తర్వాత బీజేపీ సరికొత్త వ్యూహం తో బరిలోకి దిగింది... అప్పటివరకు చక్ర అధిపత్యం కొనసాగుతూ దేశాన్ని ఏలుతున్న నేషనల్ కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించి  అధికారాన్ని సొంతం చేసుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ... దేశవ్యాప్తంగా ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించారు. మోడీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలతో బిజెపి పార్టీని  అగ్ర స్థానంలో  నిలబెట్టిన మరో నేత అమిత్ షా . ఇక ఆ తర్వాత బిజెపి పార్టీ సత్తా చాటుతూ తిరుగులేని పార్టీ ఎదిగింది. 

 

 

 ఏకంగా రెండుసార్లు అత్యధిక మెజారిటీతో రెండు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇక ఆ తర్వాత ఎన్నికలు ఏవైనా రాష్ట్రం ఏదైనా తిరుగులేని పార్టీగా సత్తా చాటింది. మొదట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని సత్తా చాటగా..   ఆ తర్వాత మాత్రం పార్టీ కొంచెం కొంచెంగా క్షీణిస్తోంది. బీజేపీ కంచికోట మారిపోయిన మహారాష్ట్రలో సరైన మెజారిటీని సాధించలేక  అధికారాన్ని కోల్పోయింది బీజేపీ పార్టీ . అటు కర్ణాటకలో కూడా ఎంతో కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రోజురోజుకు బిజెపి పార్టీ క్షీణిస్తూ వస్తుంది.  

 

 

 ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేయాలని కల కలగానే మిగిలిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి ఆప్  పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇకపోతే మరో ఏడాదిలో బీహార్ పంజాబ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయితే కనుక బిజెపి పార్టీ పని అయిపోయినట్లే. అయితే  ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం దాదాపుగా అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ  ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తుంది... ఈ పరంపర ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమైన పని. ప్రస్తుతం నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దుస్థితే త్వరలో బిజెపి పార్టీ కూడా రాబోతున్నది పలువురు రాజకీయ ప్రముఖులు కూడా జోస్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: