త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్ సమర్థులు, వీర విధేయులు కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మంత్రివర్గ విస్తరణపై ఎవరెవరికి చోటివ్వాలి అనే విషయంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్రపడిన బాల్క సుమన్ కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగం నాయకుడుగా బాల్క సుమన్ టిఆర్ఎస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించారు. ఆ సందర్భంగా కేసీఆర్  బాల్క సుమన్ ప్రతిభను గుర్తించారు. 


తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాల్క సుమన్ పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టి  కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వివేక్ ను ఓడించారు. అలాగే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు టిక్కెట్ ను టిఆర్ఎస్ తరఫున సీనియర్ నాయకుడిగా ఉన్న ఓదేలుని సైతం పక్కనపెట్టి అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయాన్ని నమోదు చేయడంతో మరోసారి కేసీఆర్ దృష్టిలో పడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇంద్రకరణ్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. 


ఇది అతిపెద్ద జిల్లా కావడంతో మరొకరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ దఫా జరిగే మంత్రివర్గ విస్తరణలో బల్కా సుమన్ కు మంత్రి పదవి కేటాయించాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. బాల్క సుమన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. అంతేకాకుండా కెసిఆర్ తోనూ మంచి సంబంధాలు ఉండడమే కాకుండా వారు సుమన్ ను కుటుంబ సభ్యుడిగా చూస్తూ ఉంటారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో సుమన్ కు అవకాశం ఇద్దామని చూసినా కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. కానీ ఈ సారి మాత్రం ఆయనకు మంత్రిగా అవకాశం రావడం ఖాయం అంటూ టిఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: