అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో .. మరోసారి నేషనల్ హీరో అయ్యాడు. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయం మామూలు విజయం కాదు.. ఐదేళ్ల పాలన తర్వాత కూడా మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 62 సీట్లు దక్కించుకోవడం అసాధారణమే.. అందులోనూ.. కేజ్రీవాల్ మొదటి నుంచి రాజకీయ నాయకుడేమీ కాదు.. కానీ.. వరుస విజయాలు అందుకుంటున్నాడు.. హ్యాట్రిక్ విజయం అంటే సాధారణం కాదుగా..

 

ఇక్కడ ఓ విషయం గమనించాలి.. అరవింద్ కేజ్రీవాల్ విజయంలో ఓ తేడా ఉంది. ఇది పూర్తిగా పాజిటివ్ విజయం. సానుకూల ఓటుతో సాధించిన విజయం.. సుపరిపాలనతో సాధించిన విజయం. అందులోనూ ఆప్ ను దెబ్బ తీయడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు పన్నింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆప్ పనైపోయిందన్న టాక్ కూడా వచ్చింది. కానీ మళ్లీ సామాన్యుడే మళ్లీ రాజయ్యాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సాధించిన విజయం వంటిదే కేసీఆర్ విజయం కూడా.

 

కేసీఆర్ కూడా సానుకూల ఓటుతోనే మరోసారి ఘన విజయం సాధించాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. జాతీయ పార్టీల ప్రాభవం దగ్గడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ బలంగా తయారయ్యాయి. అధికారం దక్కించుకుంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్.. బెంగాల్ లో మమతా బెనర్జీ.. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ తిరుగులేని విజయాలు అందుకుంటున్నాయి.

 

భారత్ రాష్ట్రాల సమాఖ్య అని.. కానీ.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నాయని.. కర్ర పెత్తనం చేస్తున్నాయని.. పైన చెప్పిన సీఎంలంతా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి శక్తివంతమైన నాయకులంతా థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడితే.. మోడీకి కష్టకాలం మొదలైనట్టే.. తిరుగులేని విజయంతో ఇప్పుడు కేజ్రీవాల్ ఆ పని ప్రారంభించొచ్చు. ఎలాగూ కేసీఆర్ ఇప్పటికే ఆ ప్రయత్నం ఓసారి చేశారు కూడా. సో.. కేజ్రీవాల్ కెప్టెన్ గా.. కేసీఆర్ వైస్ కెప్టెన్ గా ఈ థర్డ్ ఫ్రంట్ వస్తే.. మోడీకి చుక్కలు తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: