ఎనిమిది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  గతం లో కంటే ఎక్కువ మెజార్టీ సీట్లతో కేంద్రం లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ , అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల చేతిలో చావుదెబ్బ తింటోంది . కేంద్రం లో మోడీ సర్కార్ రెండవసారి  అధికారం లోకి వచ్చిన తరువాత జరిగిన పలు రాష్ట్రాల  అసెంబ్లీ   ఎన్నికల్లో బీజేపీ  పరాజయ పరంపర పరిశీలిస్తే  , దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కమలవికాసం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని ఆ పార్టీ పెద్దలకు ఈపాటికే అర్ధమై ఉంటుంది .

 

మంగళవారం వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది . ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అధినేతలంతా  స్వాగతిస్తూ , బీజేపీ ఆధిపత్యాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు . ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మిత్రపక్షమైన శివసేన ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని బీజేపీ కి ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పెద్ద దెబ్బనే చెప్పాలి . అంతకుముందు ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం అధికార పీఠాన్ని చేజిక్కించుకోగా , ఇక డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు బీజేపీ ని చేజారడడం , ఆ పార్టీ తిరోగమనాన్ని స్పష్టం చేశాయి .

 

కర్ణాటక లో మాత్రం కాంగ్రెస్ , జేడీఎస్ నాయకత్వ వైఫల్యం వల్ల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది . సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీ తో రెండవసారి  కేంద్రం లో రెండవసారి బీజేపీ కి అధికారాన్ని కట్టబెట్టిన దేశ ప్రజలు , అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలను ఆదరించడం చూస్తుంటే , ఇక రానున్న రోజుల్లో బీజేపీ కి కాంగ్రెస్ నుంచి కాకుండా ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: