ఈ రోజుల్లో సమాజంలో చూసుకుంటే ఆడపిల్లలకు అసలు రక్షణ లేకుండాపోతుంది.. ఎంతలా అంటే తాము ఆడపిల్లగా పుట్టి తప్పుచేశామా అని బాధపడేంతలా.. మనిషి అభివృద్ధి సాధిస్తున్నాడు కానీ మానసిక పరిపక్వతను కోల్పోతున్నాడు.. కాబట్టి తాను సాధించే అభివృద్ధి మనిషి ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ సమాజంలో ఒక మంచి మనిషిగా స్దానాన్ని ఇవ్వలేదు.. ఇకపోతే సామాన్యంగా హత్యాచారానికి గురైన మహిళలు వేదన భయటకు చెప్పరానిదిగా ఉంటుంది..

 

 

ఇలాంటి వారి కళ్ళకు ఆ సమయంలో ప్రపంచం అంతా శూన్యంగా మారి ఉపద్రవమేదో వచ్చి వినాశనాన్ని సృష్టిస్తే బాగుండును అనేంతలా బాధ వారి మనసులో పుడుతుంది.. ఇలానే ఒక అమ్మాయి మైనర్ వయస్సులో హత్యాచారానికి గురై ఎన్ని అవమానాలు పొందిందో తెలుసుకుంటే హృదయం ద్రవించిపోతుంది.. చివరికి తాను ఎదుర్కొంటున్న సమస్య నుండి ఎలా బయటపడిందో తెలిపింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో 2009 వ సంవత్సరం ఈమె జీవితాన్ని కాలరాసింది.. చల్లగాలికోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ చిన్నదానికి పాలిట, శాపమైంది. అప్పుడు ఆ అమ్మాయి వయస్సు వయసు 14 ఏళ్లు. ఆమె పేరే రోజ్ కాలెంబా...

 

 

అలా రోడ్డుపై నడుచుకుంటు వెళ్లుతున్న రోజ్ కాలెంబాను ఓ దుండగుడు బలవంతంగా బెదిరించి తన కారులోకి ఎక్కించాడు. ఆ కారులోనే మరో 19 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి కార్లో పట్టణానికి దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లి దాదాపు 12 గంటల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మూడో వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. అలా చేయడమే కాదు. హత్యాచారం చేస్తూ, తీవ్రంగా కొట్టారు. ఎడమకాలిపై కత్తితో పొడిచారు. బట్టలన్నీ రక్తంతో తడిచిపోయినా సృహ తప్పినా ఆమెను వదలకుండా రేప్ చేశారు ఆ నీచ నికృష్టపు కామాంధులు.. ఇక రేప్ చేశాక చంపేస్తామని రోజ్ ను బెదిరించగా, ఆమె మాత్రం మీ పేర్లు ఎవరికీ చెప్పనని.. పోలీసులకు వివరించనని తనను చంపద్దని బతిమిలాడింది. దీంతో ఆ ముగ్గురూ ఆమెను అదే కార్లో తీసుకెళ్లి తన ఇంటి దగ్గరలోని రోడ్డుపై వదిలేశారు..

 

 

రోజ్‌ను ఆ స్దితిలో చూసిన కుటుంబసభ్యులు జరిగింది తెలుసుకుని, పోలీసులకు కంప్లైట్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ పోలీస్ కూడా ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా మానసికంగా వేధించారట... ఇంతటి దయనీయ దుస్దితిని అనుభవించిన ఆ అమ్మాయి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆత్మహత్యాయత్నం చేసింది. సోదరుడు కాపాడడంతో బతికిపోయింది. ఇక అంతటితో ఊరుకోని ఆ కామపిశాచాలు, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ప్రసిద్ధ పోర్న్ సైట్ పోర్న్ హబ్ లోనూ పెట్టడంతో వీడియో ప్రపంచమంతా వైరల్ అయ్యింది.. ఇక ఆ వీడియోలు ఆ సైట్ నుండి తొలగించాలని ఈ అమ్మాయి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..

 

 

దీంతో ఇంటి నుండి బయటకు రాకుండా ఏడాది పాటు రోజ్ ఒంటరిగా నిశ్శబ్ధంగా ఉండిపోయింది.. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచనను వెంటనే అమలు చేసింది. అదేమంటే ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసింది. తనను ఒక లాయర్ గా చెబుతూ.. వీడియోలు తొలగించకపోతే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానంటూ పోర్న్ హబ్ కు ఈమెయిల్ చేసింది. దీంతో 48 గంటల్లో ఆ వీడియోలను తొలగించారు.. అలా తన జీవితం పాడైనా, మానసికంగా చచ్చిపోయినా తనను తాను ఈ సమాజంలో బ్రతికించుకుంది.. ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా తెగించి అడుగేస్తే కొంత వరకైనా ఆడపిల్లలు తమని తాము రక్షించుకునే అవకాశాలున్నాయి... ఆ దిశగా ఆలోచించండి గాని బలిపశువుల్లా బలికాకండి...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: