మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఇప్పటికి ఈ వైరస్ బారిన పడి వెయ్యి మందికి పైగా మృతి చెందారు. ఇప్పటికే 30వేల మంది వరకూ ఈ వ్యాధి బారిన పడ్డారు. వ్యాధి బయటి ప్రపంచానికి తెలిసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఈ వైరస్ కు COVID-19 గా పిలవాలని నిర్ణయించింది. కరోనా (సీవో), వైరస్ (వీఐ), వ్యాధి (డీ), అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును డబ్ల్యూహెచ్ ఓ ఖరారు చేసింది.

 

 

చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబర్ నెలలో బయటపడిన ఈ వైరస్ రోజుల వ్యవధిలో ఎంతోమంది ప్రాణాలను హరించింది. వేల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిజానికి ఈ వైరస్ కు చికిత్స లేదు. కేవలం నివారణ మాత్రమే ఈ వైరస్ కు చికిత్స అని తేల్చారు కూడా. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ఇప్పటికి ప్రపంచంలోని 26 దేశాలకు విస్తరించింది. భారత్ లో కూడా ఈ వైరస్ కు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోనే ఈ మూడు కేసులు నమోదయ్యాయి.

 

 

కరోనా వైరస్ వ్యాప్తికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. దగ్గు తుమ్ములు, శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా ఈ వ్యాధి చెందే అవకాశం ఉందంటే ఈ వైరస్ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారికి తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్య, జలుబు, దగ్గు, జ్వరం, మోకాలి నొప్పులు వస్తాయి. చైనాలో అత్యవసర స్థితి ఇంకా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: