మొన్నటివరకు ప్రపంచ దేశాలన్ని చాలా ప్రశాంతంగా ఎవరిపనిలో వారు నిమగ్నమై ఉన్నారు.. కాని సడెన్‌గా చైనా ఒక అలజడిని సృష్టించి, దీనివల్ల ప్రపంచ దేశాలకు నిదుర లేకుండా చేసింది.. దాని పేరే కరోనా వైరస్.. ఒంటరిగా వచ్చింది వరుసపెట్టి విద్వంసాన్ని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు వందల ప్రాణాలు, వేయిల సంఖ్యలో ఈ వైరస్ బారినపడిన ప్రజలు. కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్ద.. ప్రపంచంలో నాకంటే గొప్పవాడు లేడని విర్రవీగుతున్న మనిషిని ఊపిరికూడా పీల్చుకోలేనంతగా పీల్చి పిప్పి చేస్తుంది.

 

 

మరి ఇలాంటి సమయంలో తాను ఇన్నాళ్లనుండి సాధించిన విజ్ఞానం ఎక్కడ దాక్కుంది.. ఈ పరిస్దితికే అన్ని దేశాలు విలవిలలాడుతుంటే, ఇక ప్రపంచ దేశాల్లో యుద్దాలు జరిగితే ఆ నష్టాన్ని ఒక్క సారి ఊహించుకోండి.. అణుబాంబులు, బయో వార్‌లు అని చెప్పుకుంటున్న దేశాలు, తమ ఆధిపత్యం కోసం అమాయక ప్రజల మీద ప్రయోగించడం ఎంతవరకు సమంజసం.. ఇకపోతే మనుషులకు పేరు మార్పు చేసినట్లు ఇప్పుడు కరోనా వైరస్‌కు పేరును మార్చారు  ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు..  ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది.

 

 

ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రన్ అదానోమ్ తెలిపారు. కోవిడ్-19 (covid-2019)  అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని పేర్కొన్నారు.. ఇక ఇప్పటికే కొన్ని వైరస్‌ల సమూహానికి కరోనా అని పేరు ఉందని కాబట్టి, ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు వారు తెలిపారు. అంతే కాకుండా ఈ పేరు స్వతంత్రంగా ఏ ఒక్కదానినీ సూచించదని పేర్కొన్న టెడ్రస్.. ఈ కొత్త పేరు ఆ వ్యాధిని గురించి మాత్రమే తెలియజేస్తుందని స్పష్టం చేశారు.. ఇక వ్యాధుల పేర్లు మారడం మాట అటుంచితే, ఈ వ్యాధిని సమూలంగా నివారించే మార్గాలను ఎప్పుడు కనుగొంటారో ఎవరు తెలుపడం లేదు.

 

 

కానీ ఒక్క విషయం మాత్రం మేధావులు గమనించాలి, ప్రకృతి ముందు ఎప్పటికైనా మనిషి చిన్నవాడే అని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడుతున్నా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోలేక పలు రకాల వినాశాలకు కారణం అవుతున్నాను ఇకముందు ముందు ఇలా చేస్తే ఇంకా ఎన్ని విద్వంసాలు మొదలవుతాయో అని గమనించి తమ ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే ఈ పుడమి పైన మానవుని మనుగడ సుఖంగా సాగుతుంది. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు..

మరింత సమాచారం తెలుసుకోండి: