ఢిల్లీ ఎన్నికల ఫలితం నరేంద్రమోడిపై బాగానే పడినట్లుంది. ఎందుకంటే బుధవారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డితో మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటికి అపాయిట్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాగానే  జగన్ తో వీళ్ళిద్దరికీ భేటి ఫిక్స్ అవ్వటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే గడచిన మూడు టూర్లలో జగన్ కు అమిత్ షా అపాయిట్మెంట్ ఇచ్చి కూడా  క్యాన్సిల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి జగన్ ను అమిత్ ఉద్దేశ్యపూర్వకంగా అవమానించినట్లే లెక్క.

 

ప్రధానమంత్రితో అపాయిట్మెంట్ కావాలని జగన్ కోరినా పిఎంవో పట్టించుకోలేదు. అంటే జగన్ ను కలవాలని నరేంద్రమోడి అనుకోలేదు. కాబట్టి పదే పదే అపాయిట్మెంట్ కోరినా  పట్టించుకోలేదు. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాలు ఢిల్లీలో పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయించుకోవాలన్నది జగన్ ఉద్దేశ్యం. అయితే అందుకు మోడి, షా ఇద్దరూ అవకాశం ఇవ్వలేదు.

 

అలాంటిది జగన్ తో భేటికి నరేంద్రమోడి, అమిత్ షా లు ఇద్దరూ బుధవారం సాయంత్రం అపాయిట్మెంట్ ఇవ్వటం గమనార్హం. ఇంతలోనే వీళ్ళిద్దరిలో అంత మార్పు ఎందుకు వచ్చింది ? ఎందుకంటే ఇద్దరికీ ఢిల్లీ జనాలు మాడు పగలగొట్టారు కాబట్టే. లోక్ సభలో తమకు ఎదురేలేదంటూ మోడి ఎవరినీ లెక్క చేయటం లేదన్నది వాస్తవం. ఏ విషయంలో కూడా ప్రతిపక్షాలను కనీసం లెక్క కూడా చయటం లేదు. రాష్ట్రాల ప్రయోజనాలను ఏమాత్రం లక్ష్య పెట్టటం లేదు.

 

రాష్ట్ర విభజన హామీలను మోడి ఎలా తుంగలో తొక్కుతున్నది జనాలందరూ చూస్తున్నదే. ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అశాలను ప్రస్తావించటానికి కూడా మోడి ఇష్టపడటం లేదు. అలాగే కేంద్రంలో పెండింగ్ లో ఉన్న దిశ చట్టం బిల్లు, శాసనమండలి రద్దు చట్టం బిల్లు, మూడు రాజధానుల అంశాన్ని కూడా జగన్ మోడి, అమిత్ తో ప్రస్తావించే అవకాశం ఉంది. మరి మోడి ఏం చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: