దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ పతాకం ఎగరవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..మూడవ సారి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. ఈ ఎన్నికల్లో మొత్తం డెభ్బై స్థానాలకి గాను ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలని గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాలని గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ అసలు బొణీయే తెరవకపోవడం విచిత్రం...

 

 


గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ డెభ్బై స్థానాలకి 67 సీట్లు గెలుచుకుంటే బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టుకుంది. కానీ కాంగ్రెస్ బోణీ కూడా తెరవలేదు. ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని మూడు పర్యాయాలు పాలించిన పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం అందరిలో అనేక సందేహాలని సృష్టించింది.

 

 

 


జాతీయ పార్టీగా దేశాన్ని ఎన్నో సార్లు పాలించిన పార్టీ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం చూస్తుంటే, ఆ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం ఏ  మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరనేది విశ్లేషిస్తే రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటగా కాంగ్రెస్ పాలించిన మూడు పర్యాయాలు రాష్ట్రంలో జరిగిన మార్పులు జనాలకి ఇంకా గుర్తున్నాయి.

 

 

 

సాంప్రదాయ రాజకీయాలకి అతీతంగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పాలనలో ఎన్నో మార్పులని చేసింది. ఆ మార్పులు ప్రజలకి ఎంతో మేలు చేకూర్చాయి. ఇక రెండో అతి ముఖ్యమైన కారణం ఆలోచిస్తే కాంగ్రెస్ లీడర్లు బలంగా లేకపోవడమే. అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి నుండి రాష్ట్రాల్లో ఉన్న లీడర్ల వరకు వాళ్లలో వాళ్లకే కన్ఫ్యూజన్ ఉండడం కూడా వారి పతనానికి కారణమైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: