ప్రతి ఆదివారం  కొత్తపలుకు పేరుతో వేమూరి రాధాకృష్ణ రాస్తున్న చెత్త పలుకులో ఇదే విషయంపై అనుమానం పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడుకు ఎదురైన ఘోర పరాజయాన్ని వేమూరి వారు తట్టుకోలేకున్నారు. దాంతో  వైసిపికి ఓట్లేసిన జనాలపైనే కాకుండా చంద్రబాబును చావుదెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డిపైన కూడా పగబట్టినట్లున్నారు. దానికితోడు చంద్రబాబుతో పాటు కమ్మ సామాజికవర్గంలోని కొందరి ఆర్ధిక మూలాలు కదలిపోతుండేసరికి ఆర్కె ఏమాత్రం తట్టుకోలేకపోతున్నట్లుంది. అందుకనే బుర్రకు ఏమి తోస్తే దాన్ని చెత్తపలుకులో పెట్టేస్తున్నారు.

 

మొన్నటి ఆదివారం చెత్తపలుకులో రాసిందేమిటయ్యా అంటే జగన్ పై మంత్రుల్లో అసంతృప్తి ఉందని. ఓ మంత్రేమో అసలు వైసిపికి 151 మందబలాన్ని ఇవ్వకూడదని తనతో  చెప్పినట్లు ఆర్కె రాశారు. మరో మంత్రేమో రెండేళ్ళ తర్వాత తొలగిపోయే 90 శాతం మంత్రుల్లో కాకుండా కంటిన్యు అయ్యే 10 శాతంలో ఉండేందుకు తామంతా చొక్కాలు చించుకున్నట్లు చెప్పాడట. ఇంకో ఎంఎల్ఏ ఏమో జగన్ మొండి వాడని ఎవరు చెప్పినా వినేరకం కాదని మొత్తుకుంటున్నాడట. ఇలా పిచ్చి రాతలు చాలానే ఉన్నాయిలేండి చెత్తపలుకులో.

 

జగన్ ఎంత మొండివాడో లోకానికంతా తెలుసు. దేశంలోనే అత్యంత శక్తవంతమైన నాయకురాలుగా ఉన్న సోనియాగాంధినే ఎదిరించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినపుడే జగన్ ఎంతటి మొండివాడో అందరికీ అర్ధమైపోయింది. ఆ తర్వాత సిబిఐ కేసులు పెట్టి జైల్లో పెట్టినపుడు, ఆ తర్వాత వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను చంద్రబాబునాయుడు లాక్కున్నపుడు కూడా జగన్ తొణకలేదు.  

 

ఇక వేర్వేరు సందర్భాల్లో ఎల్లోమీడియా తనను టార్గెట్ చేసినపుడు కూడా లెక్క చేయలేదు.  ఇపుడు కూడా అదేపనిగా ఎందుకు రాస్తోందంటే మంత్రులను జగన్ కు వ్యతిరేకంగా ఎగదోసే ప్రయత్నమనే అనుకోవాలి. బయటనుండి జగన్ ను ఏమీ చేయలేకపోయిన కారణంగా మంత్రులు, ఎంఎల్ఏలను జగన్ కు వ్యతిరేకం చేద్దామనే ఆలోచనే కనబడుతోంది. జాతి, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు చూస్తుంటే ఎల్లోమీడియా జగన్ పై పగబట్టిందని అందరికీ అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: