దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలు ఒక పెను సంచలనమే రేపాయి. సాధారణంగా ఒక రాష్ట్రంలొ జరిగే ఎన్నికలకి ఇంతలా పాపులారిటీ రావడం అరుదు. కానీ దేశ రాజధాని, ప్రధాని నివాస స్థలం అయిన ఢిల్లీలో జరిగే జరిగే ఎన్నికలకి ఆమాత్రం హడావిడి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు కైవసం చేసుకుని సునాయాసంగా విజయం సాధించి, వరుసగా మూడవ సారి ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని అధిష్టించనుంది.

 

 

 


ఈ ఎన్నికల్లొ బీజేపీ గతం కంటే కొంచెం మెరుగుపడి సింగిల్ డిజిట్ కే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. అయితే జాతీయ స్థాయిలో అధికారమున్న ఒక పార్టీకి రాష్ట్రంలో ఇంత ఘోరమైన ఫలితాలు రావడం ఆశ్చర్యకరమే. ఈ ఫలితాల వల్ల కేంద్రంలో ప్రాంతీయ పార్టీల వెయిట్ పెరగనుంది. లోక్ సభలో ఫుల్ మెజార్టీలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి.

 

 

 

ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓడిపోవడంతో రాజ్యసభలోనూ సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సీట్లు పెరిగితే రాజ్యసభలో తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవచ్చు అని చూసిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రాజ్యసభలో మెజార్టీ కోసం ఎలాగైతే ప్రాంతీయ పార్టీలని ప్రసన్నం చేసుకోవాలని చూస్తుందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండనుంది.

 

 

 

దీంతో ప్రాంతీయ పార్టీలు కొండెక్కి కూర్చోవడం ఖాయం. తటస్థ పార్టీలయిన్ తెరాస, వైఎస్సార్ సీపీ లాంటి పార్టీలకి ఇప్పుడు రాజ్యసభలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అదీ గాక ప్రధాని ఏరియాలో కూడా సీటు గెలవలేకపోయారన్న అపప్రద కూడా ఉంటుంది. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తటస్థ పార్టీలకి వరంగా మారాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: