నల్లగొండ జిల్లా చిట్యాల లో జరుగుతన్న సహకార సంఘం ఎన్నికల్లో దారుణం జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జలందర్‌ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. బండరాళ్ల తో దాడి చేయటం తో జలంధర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. జలంధర్ రెడ్డి మూడో వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషయం గా ఉంది. దీంతో చిట్యాల లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను హైదరాబాద్‌ తరలించారు. అధికార పార్టీ కార్యకర్తలే హత్యకు ప్లాన్‌ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై ఎస్సై రాములుకు ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఎస్సై రాములు వ్యవహారశైలి పై అనుమానాలు ఉన్నాయంటున్నారు జలంధర్‌ రెడ్డి బంధువులు. గాయపడ్డ జలంధర్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్‌ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఈ దాడికి పాల్పడ్డట్టుగా చెప్పాడు.


జలంధర్‌ రెడ్డిపై దాడికి ముందుకు అక్కడ తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఘర్షణ జరుగుతున్నంత సేపు పోలీసులు అక్కడే ఉన్నారు. అయితే దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏమయ్యారు. అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్థులు టార్గెట్గా ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని దీంతో దాడులు తీవ్రమయ్యాయని ఆరోపిస్తున్నారు.


అయితే ఈ విషయం పోలీసుల వాదన మరోలా ఉంది. దాడికి వ్యక్తిగత కక్షలే కారణం అయ్యుంటాయని భావిస్తున్నారు. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తరుచు ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం పై ప్రభుత్వ అధికారులు సీరియస్‌ అవుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: