ప్రేమ ప్రతి మనిషి జీవితంలోనూ అమూల్యమైన జ్ఞాపకం.. మరపురాని అనుభూతి.. మరి ప్రేమ ఎలా పుడుతుంది.. ఎవరిని ప్రేమిస్తారు.. ఎవరైనా ప్రేమించేందుకు కారణాలు ఏంటి.. ఎలాంటి లక్షణాలు ప్రేమకు దోహదం చేస్తాయి.. ఎవరిని ఎందుకు ఎవరు ఎప్పుడు ఎలా ప్రేమిస్తారు.. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ప్రేమలో సమాధానం దొరకని ప్రశ్నలే ఎక్కువ.

 

 

అందుకే ఈ ప్రేమ సాగర మథనాన్ని తమ పరిశోధనలతో మధించేందుకు మానసిక శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగమే ఈ ప్రేమ నిర్ణయం ఎంత సేపట్లో తీసుకుంటారు అనేది.. ఎవరైనా ఎవరినైనా ప్రేమించాలి.. లేదా ఈ వ్యక్తి మనకు నచ్చాడు అనే నిర్ణయం మనస్సు ఎంత సేపట్లో తీసుకుంటుందో తెలుసా.. ఇందుకు వచ్చే సమాధానం మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

 

అవును మరి.. ఓ వ్యక్తి నచ్చాడో లేదో చెప్పేందుకు మీ మెదడు తీసుకునే సమయం కేవలం నాలుగు నిమిషాలు మాత్రమేనట. అవతలి వ్యక్తి మీకు నచ్చారో లేదో ఆలోచించి మీ మెదడు 4 నిమిషాల్లోనే ఓ నిర్ణయానికొచ్చేస్తుందట. అంటే అంత తక్కువ సమయంలోనే మీరు నిర్ణయం తీసేసుకుంటారు. అయితే దాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు.. ఎంత కాలానికి ప్రకటిస్తారు అనేది వేరే విషయం .

 

 

కానీ మీ మెదడు అవతలి వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునేందుకు మాత్రం కేవలం నాలుగు నిమిషాలే తీసుకుంటుందట. అందుకేనేమో చాలా మంది తమది తొలిచూపు ప్రేమ అంటుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ గొప్పగా చెప్పుకుంటారు. మరి తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా అని చెప్పేందుకు ఈ అధ్యయనం కూడా అంగీకారం చెబుతున్నట్టేగా.. ఒకవేళ మీరు ఇప్పటికీ ప్రేమలో పడకపోయినట్టయితే.. మీ మనసు చెప్పే మాట వినండి. మరి జీవితానికి సంబంధించిన కీలక మైన నిర్ణయం అంత తక్కువ సేపట్లో తీసుకుంటుందా అన్న అనుమానమే మీకు రాకూడదు. ఎందుకంటే మనసంటే అంతే మరి. ప్రేమంటే అంతే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: