ఈ సృష్టిలో ఎంతగా పొగిడిన ఏదో వెలితిగా మిగిలేది ప్రేమ అని చెప్పవచ్చూ.. అయితే ఈ ప్రేమలో ఎన్నో రకాలున్నాయి.. ప్రేమను వ్యక్తపరిచే భావాలు కూడా ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఎన్ని ప్రేమలున్నా, అమ్మ ప్రేమ మీదికి అన్ని దిగదుడిపే.. నీ ప్రేయసి నిన్ను మగాడిగా ప్రేమిస్తుంది. నీతో సుఖాలందుకోవడానికి ప్రేమిస్తుంది. నీ ఆస్తి కోసం ప్రేమిస్తుంది. నీ అందం చూసి ప్రేమిస్తుంది. ఇలా ఈ సృష్టిలో ఎవరి ప్రేమను చూసుకున్న దానిలో ఎంతో కొంత స్వార్ధం ఉంటుంది. కాని స్వచ్చమైన ప్రేమకు, అమృతం వంటి చిరునామా అమ్మ..

 

 

ఈ ప్రేమలో ఎలాంటి స్వార్ధం ఉండదు. ఈ ప్రేమలో ఎలాంటి దోషం ఉండదు.. నువ్వు కురీపి అయినా, అవిటి వాడివైనా, అంటరాని వాడివైనా తల్లి మనస్సు మాత్రం ఎప్పుడు తనను బిడ్దగానే చూస్తుంది.. ఒక మనుషులకే స్వంతం కాదు ఈ ప్రేమ.. పశుపక్ష్యాదులు కూడా ఈ ప్రేమకు అతీతమే... అందుకే కాకిపిల్ల కాకికి ముద్దంటారు. ఇందులో లోతుగా పరిశీలిస్తే దీని తాలూకు భావం, ప్రేమ సృష్టంగా గోచరిస్తుంది.. ఇక ఈ కాలంలో మనుషుల మనసులు కలుషితం అవుతున్నాయో గాని ప్రేమ మాత్రం కలుషితం అవడం లేదు. దానికున్న పదం మాత్రం మారడం లేదు. ప్రేమను ప్రేమ అంటారే గాని, మరే విధంగా నిర్వచించడానికి వీలు లేదు..

 

 

ఈ ప్రేమకు బానిసలుగా మారని వారున్నారా.. ఏ మతంలో తీసుకున్న భక్తుడు పంచే ప్రేమముందు భగవంతుడు కూడా తల వంచాడు.. చివరికి మరణం కూడా ఓడిపోయిన చరిత్ర మనపురాణాల్లో ఉంది... ప్రేమను ఒక స్పర్శ ద్వారానే పంచవచ్చు, పడక గదిలోనే పంచవచ్చు, ఆడదాని కౌగిలి ద్వారానే ప్రేమ పొందవచ్చూ అనే భావనలో మార్పు రావాలి.. అంతే కాదు కల్మషం లేని ప్రేమ, కలుషితం అవ్వని ప్రేమ ఈ సమాజానికి ఎంతో అవసరం ఉన్నది.. అది కొరవడటం మూలానే మనుషులు అని చెప్పుకుంటున్న వారు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు..

 

 

ఇక ప్రేమ ఈ సృష్టి మొదలు నుండి చివరి వరకు అజరామరంగా విలసిల్లుతూ ఉంటుంది. దానిలో మార్పు ఉండదు.. ఇకపోతే ఈలోకం ప్రేమతోనే నడుస్తుంది. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది దైవత్వం, అది అజరామరం. లవ్‌ ఈజ్‌ ఫరెవర్‌. అందుకే ప్రేమను ప్రేమగానే బ్రతికిద్దాం.. ద్వేషంతో మాత్రం చంపొద్దు.... అప్పుడే ఈ ప్రేమకు సరైన అర్ధం మిగులుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: