తెలుగుదేశంపార్టీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కోవటంలో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సలహాలే ప్రధాన కారణమనే  అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే యనమలను జనాలు తిరస్కరించి పదిహేనేళ్ళవుతోంది. చివరిసారిగా 2004 ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత నుండి రామకృష్ణుడు కానీ ఆయన సోదరుడు యనమల కృష్ణుడు కానీ గెలిచిందే లేదు. ఏదో సీనియర్ అనే ముద్రవల్ల అసెంబ్లీకి గెలవలేకపోయినా  శాసనమండలి సభ్యుడు అయిపోయి మంత్రిగా చెలామణి అయిపోతున్నాడు.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితులకు యనమల సలహాలు కూడా ప్రధాన కారణమే అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు యనమల ఓవర్ యాక్షనే ప్రధానమని పార్టీలోనే చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో  మండలిలో మెజారిటి ఉంది కదాని ఛైర్మన్ ను యనమల తప్పుదోవ పట్టించిన కారణంగానే  గొడవలు జరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు కూడా యనమలనే గుడ్డిగా నమ్ముతుండటంతో  సమస్యలు ముదిరిపోతున్నాయి. 

 

లేని అధికారాలను ఉన్నాయని చెప్పి రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు చేసిన ప్రకటనతో మొదలైన వివాదం చివరకు సెలక్ట్ కమిటి ప్రకటనను అధికారులు తిరస్కరించటంతో  పీక్ కు చేరుకుంది.  తెరవెనుక నుండి యనమల ఛైర్మన్ ను ఒత్తిడి పెడుతుండటమే ఈ కంపుకు మూల కారణమని వైసిపి చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.

 

ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే  మండలి సెక్రటరీని అరెస్టు చేయిస్తామని, అరెస్టు చేయకపోతే డిజిపిని కూడా మండలికి పిలిపిస్తామనే పిచ్చి ప్రకటనలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఛైర్మన్ అంతదాకా తెగిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకుంటుందా ?  విషయం తెలిసి కూడా యనమల ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.   యనమల ఆదేశాల వల్లే ఛైర్మన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకే యనమల అధికారుల మీద ఎదురుడి చేస్తుండటమే విచిత్రంగా ఉంది. అంతా చూస్తుంటే శాసనమండలి రద్దు ప్రతిపాదనకు యనమల చేసిన ఓవర్ యాక్షనే కారణమనే అనుమానం బలపడుతోంది. ఇంత జరుగుతున్న తాము చేస్తున్న తప్పులపై సమీక్ష చేసుకోవటానికి టిడిపి ఇష్టపడటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: