ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. దేశ రాజధానిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోలేని పార్టీగా ప్రజల ముమ్దు నిలబడాల్సి రావడం ఆ వర్గాల్లో ఒకింత ఇబ్బందిగా ఉంది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగి అత్యధిక మెజార్టీతో లోక్ సభలో విజయం కేతనం ఎగరవేసిన పార్టీ ఒక రాష్ట్రంలో ఘోరంగా చతికిల పడటం అందరినీ ఆలోచింపజేస్తుంది.

 

 

అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ ప్రజలతో మాట్లాడుతూ, ఢిల్లీలీ గెలిచి ఈ దశాబ్దంలోనే తొలొ గెలుపు సాధించి.. ముందుకు సాగుదామని..అందుకు అనుగుణంగా పార్టి శ్రేణులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చాడు. దశాబ్దంలో జరుగుతున్న మొదటి ఎన్నికల్లో విజయం సాధించి, ఆ స్ఫూర్తితో దశాబ్దం పాటు ఢిల్లీలో తమ జెండా ఎగరవేయాలని భావించాడు.

 

 

అయితే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బలం ఏంటో తెలియక మోదీ ఇలా మాట్లాడుతున్నరని అన్నవాళ్ళూ ఉన్నారు. వారు అన్నమాటే నిజమయింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయ కేతనం ఎగరవేసి బీజేపీకి ఘోరమైన ఓటమిని మిగిల్చింది. డెభ్భై స్థానాలకి గాను ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలని గెలుచుకోగా బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమై కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

 

 

మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు కూడా ఇలా తిరగగొట్టడంతో మోదీ ఆలోచనలో పడిపోయారు. మరి దశాబ్దంలోనే తొలొ ఎన్నికల్లో గెలిచి దశాబ్దం మొత్తం విజయాలనే తన ఖాతాలో వేసుకుందామనుకున్న పార్టీకి పరాజయం స్వాగతం పలికింది. మోదీ చెప్పిన మాటలు రివర్స్ కావడంతో బీజేపీ కార్యకర్తల్లో నిస్సత్తువ ఆవరించింది.

 

 

మరో పక్క తటస్థ పార్టీలు బీజేపీ ఢిల్లీలో ఓడిపోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు. దశాబ్దంలో తొలి ఓటమిని ఎదుర్కొన్న బీజేపీ దశాబ్దం మొత్తం అలాగే ఓటమినే మూటగట్టుకుంటుందా అంటూ సొషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: