మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో ప్రేమ ఒకటి. యవ్వనంలో యువతీ, యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణ, స్నేహం.. ప్రేమగా చిగురించి పెళ్లి వరకూ వెళ్తుంది. ఇరువురి జీవితాల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేది ఈ ప్రేమే. ఇంతటి ప్రేమలో ఢిల్లీకి రారాజులా మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్ కూడా ఉన్నారు. యవ్వనంలో తోటి విద్యార్ధినితో చిగురించిన ప్రేమ వారి వైవాహిక బంధానికి దారి తీసింది. ఇప్పటివరకూ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన అన్ని విజయాల్లో భార్య సునీత సహకారం మెండుగా ఉండటానికి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమే కారణం.

 

 

వీరిద్దరూ సివిల్స్ పరిక్ష రాసి ఐఆర్ఎస్ కు ఎంపికై నాగ్ పూర్ లోని ఐఆర్ఎస్ అకాడమీలో శిక్షణ కోసం వచ్చిన రోజుల్లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కేజ్రీవాల్ లో ప్రజల కోసం సేవ చేయాలనే తపన, నిజాయితీని చూసి సునీత ప్రేమలో పడితే.. సునీతలోని తెలివితేటలు, వ్యక్తిత్వం చూసి కేజ్రీవాల్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల్లోని పెద్దలు మొదట ఒప్పుకోలేదట. తర్వాత వీరి ప్రేమలోని నిజాయితీని చూసి పెద్దలు సమ్మతి తెలిపారట. దాంతో 1994 నవంబర్ లో కేజ్రీ – సునీత వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పులకిత్, కుమార్తె హర్షిత. వీరిరువురూ కూడా ఐఐటీయన్లే కావడం విశేషం.

 

 

ప్రేమికిడిగా కంటే కేజ్రీవాల్ కు ప్రేమికుల దినోత్సవం రాజకీయ జీవితంలో బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. 2013లో మొదటిసారి ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 2020లో సాధించిన విజయంతో మూడోసారి సీఎం కానున్నారు. ఈసారి కూడా ఆయన ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ విజయం సాధించిన ఫిబ్రవరి 11 ఆయన భార్య సునీత పుట్టినరోజు కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: