ఉదయగిరి గవర్నమెంట్‌ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులను వేధిస్తున్న గవర్నమెంట్‌ డాక్టర్‌ కు దేహశుద్ధి చేశారు బాదితురాలి కుటుంబ సభ్యులు. స్టాఫ్ నర్సులను లైంగికంగా వేదిస్తున్న డాక్టర్‌ రవీంద్రనాధ్ ఠాగూర్‌పై బాదితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సందర్భంగా బాదితురాలు మాట్లాడుతూ డీడీఓగా పనిచేస్తున్న వ్యక్తి తమను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని వెల్లడించారు.


`మంగళవారం డ్యూటీ తరువాత నైట్ ఇంటికి వెళితే, నాకు ఎగ్‌ ఆమ్లెట్ కావాలి కొంచెం చేసి తీసుకురావాలని చెప్పాడు. అయితే చేసి చైతన్యతో పంపిస్తా అని చెప్పినా వద్దు నువ్వే తీసుకురా అని డాక్టర్ చెప్పాడు. తీసుకొని ఇవ్వడానికి ఆయన రూంలోకి వెళితే.. నువ్వంటే నాకిష్టం సిస్టర్లందరిలో నువ్వే మంచి దానివి అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు నాతో ఓ పది నిమిషాలు గడుపు అన్నాడు. మీరు నాకు తండ్రితో సమానం, నా క్యారెక్టర్ అలాంటి కాదని చెపితే ఆయన తండ్రి అనే పదాన్ని కాసేపు పక్కన పెట్టు, నాతోన ఉండు అని ఒత్తిడి చేశాడు` అని తెలిపారు.


ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆడవాళ్లుకు పని చేసే చోట ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదు. బాధ్యాతయుతమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఇలా చేయటం మరింత హేయం అంటున్నారు. అయితే డాక్టర్‌ రవీంద్రనాథ్ గతంలో కూడా ఇలాంటి పనులు చేసి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయన ఇలా ఆరోపణలతోనే సస్పెండ్‌ కూడా అయ్యారు. కానీ తన పలుకుబడితో తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్న రవీంద్రనాద్‌ తిరిగి తన వంకర బుద్ధి చూపించాడు.


గతంలో కూడా ఉన్నతాదికారులకు ఆయన గురించి ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు పట్టించుకోకపోవటంతో బాదితులు స్వయంగా దాడికి దిగారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తున్నారు. ఇప్పటికే వైధ్య అధికారులతో పాటు కలెక్టర్‌ కూడా ఈ సంఘటనపై స్పందించారు. రెండు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: