జగన్ అకస్మాత్తుగా ఢిల్లీ టూర్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొన్నటివరకు జగన్ కానీ, వైసీపీ నాయకులు కానీ కేంద్ర బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే నిరాశే ఎదురయ్యేది. అసలు వైసీపీ అంటే ఆమ్మో అన్నట్టుగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించేవారు. ఒక దశలో ఏపీలోనూ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీని బీజేపీ నాయకులు చూస్తూ తెలుగుదేశం విమర్శిస్తున్న స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని బీజీపీ విమర్శించేది. ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్ అన్నట్టుగా వైసీపీ తో వ్యవహరించేది. కానీ ఎందుకో తెలియదు బీజేపీ వైసీపీ తో సన్నహితంగా ఉండడమే కాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పార్టీకి మద్దతుగా నిలబడుతూ వస్తోంది కేంద్రం. 


మూడు రాజధానులతో పాటు, శాసనమండలి రద్దు విషయంలోనూ జగన్ నిర్ణయానికి జై కొడుతూ వస్తోంది కేంద్రం. ఈ పరిస్థితుల్లోనే నిన్న అకస్మాత్తుగా జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చి కలవాల్సిందిగా మోదీ నుంచి పిలుపు అందింది. జగన్ కూడా వెంటనే ఢిల్లీ కి వెళ్లిపోయారు. ఏపీ లో నెలకొన్న సమస్యలు, నిధుల విషయమై జగన్ చర్చించబోతున్నారు అని అంతా అనుకున్నారు. కానీ మోదీ మాత్రం కేంద్ర మంత్రి వర్గంలోకి వైసీపీని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా జగన్ కు కూడా సమాచారం అందింది. ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

 

ఢిల్లీలో క్రేజీవాల్ పార్టీ గెలిచిన తరువాత, జార్ఖండ్ మహారాష్ట్ర, హర్యాన లో చేదు ఫలితాలు చుసిన తరువాత బీజేపీ వైకిరిలో మార్పు చాలానే కనిపిస్తోంది. మొన్నటివరకు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకు ప్రయత్నించినా ఇప్పుడు మాత్రం ప్రాంతీయ పార్టీలన్నిటిని కలుపుకుని ముందుకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో బీజేపీ పెద్దలు వచ్చేసారు. దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుండడం జగన్ పార్టీతో పాటు తమిళనాడులోని డీఎంకే పార్టీకి ఉన్న రాజ్యసభ స్థానాలు తదితర విషయాలన్నింటిని ధృతిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రెండు పార్టీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారట. జగన్ తో పాటు డీఎం కే కూడా ఈ విషయంలో సముఖంగా ఉండడంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో ఈ రెండు పార్టీలకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: