అమ్మ గర్భం లేకుంటే మనిషికి జననమే లేదు. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మకు ఒక్కసారి పిల్లలు పుడితే చాలు వారికీ పిల్లలే సర్వవం అయిపోతారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవం అంటారు. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదని అంటుంటారు.

 

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. అమ్మ ప్రేమ లేకుంటే మన జీవన ప్రయాణానికి మొదలే లేదు. అలాంటి అమ్మను మనం నిత్యం ప్రేమించాలి. అమ్మ గొప్పతనాన్ని తలచుకుంటూ జీవించాలి. తల్లి ఏ స్థాయిలో ఉన్న తన బిడ్డల కోసం ఒక్క మెట్టు దిగి రావాల్సిందే. తల్లి ఎంత బిజిగా ఉన్న తన పిల్లల బాగోగులు ఆమె చూసుకుంటుంది. తమ పిల్ల అవసరాలను తెలుసుకొని వారికీ కావాల్సింది అందుబాటులో పెడుతుంది అమ్మ. 

 

కేంద్రలో కీలక పదవి పోషిస్తున్న స్మృతి ఇరానీ కూడా ఒక్క కూతురికి తల్లే. అయితే కేంద్రమంత్రిగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉండే స్మృతి ఇరానీ కుమార్తె కోసం సాధారణ గృహిణిగా మారిపోయారు. కుమార్తె అడిగిందని ఇష్టమైన వంటలు చేసిపెట్టారు. తనకు ఇష్టమైన వంటలు చేసి పెట్టమని కుమార్తె జోయిషి ఇరానీ అడగ్గానే గరిటె చేతపట్టిన మంత్రి పలు రకాల వంటలు చేసి కుమార్తెకు తినిపించారు.

 

అంతేకాదు, ఆ వంటలు, వాటి వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. వెజ్ హక్కా నూడుల్స్, చికెన్ మంచూరియా వంటి పలు వంటకాలు చేసిన స్మృతి.. వాటి తయారీ విధానాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఇవి చూసిన వారు భేష్ అంటూ కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: