ప్రస్తుతం ప్రపంచంలో ఒకే విషయం పై చర్చ నడుస్తుంది.. అదే కరోనా.  కరోనా వైరస్ బీభత్సానాకి దేశ వ్యాప్తంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.  ఇక   చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ రక్కసి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఈరోజుతో వెయ్యి దాటింది. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం చైనా దేశ వ్యాప్తంగా 1,011 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మందికి ఈ కరోనా వైౌరస్ సోకినట్టు సమాచారం.  అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని మార్కెట్ వ్యవస్థలు కూడా అతలాకుతలం అవుతున్నాయి.  తాజాగా  కరోనా వైరస్ కోళ్లలో ప్రవేశించిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో పుకార్లు రావడాన్ని అధికారులు ఖండించారు.

 

కోళ్లకు కరోనా వైరస్ సోకుతుందని ఇంతవరకు నిరూపితం కాలేదన్నారు. తణుకు నియోజకవర్గంలో అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతుండటంతో ఈ పుకార్లు వచ్చాయి.   ఈ క్రమంలోనే తణుకుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో  చికెన్ తోపాటు  మటన్ అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు. తణుకులో పరిస్థితిని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమీక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి వారం రోజుల పాటు మటన్, చికెన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ‘వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.

 

ఇదిలా ఉంటే.. హూబీ ప్రావిన్స్ లో మరో 2,097 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి హెల్త్ కమిషన్ నిర్ధారించింది. దేశ వ్యాప్తంగా 42,200 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడటం కలవరపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం మటన్, చికెన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇక వైరస్ బారినపడి చనిపోయిన కోళ్లను కాలువలు, రోడ్ల పక్కన పడేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పురపాలక‌, నీటిపారుదల శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: