ప్రపంచంలో ఏ కొద్ది మంది వ్యక్తులను మినహాయిస్తే విజేతలలో చాలామంది 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఆర్ధిక విజయాలు అందుకున్నవారుగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఇలా వీరందరూ గొప్ప విజయాలను సాధించడం వెనుక వీరి తెలివైన ఎంపిక శక్తి వీరి ఆర్ధిక విజయాలను ప్రభావితం చేసింది.


జీవితంలో ప్రతి సందర్భంలోనూ అనుకూలంగా స్పందించాల లేకుంటే ప్రతి కూలంగా స్పందించాల అన్న విషయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే చాలామంది ఏ విషయంలోనూ అసలు స్పందించరు. ఒక విద్యార్థి తనకు పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయని బాధ పడుతూ కాలం గడిపేస్తాడు కానీ ఇంకా పట్టుదలతో చదివి రాబోయే పరీక్షలలో తాను కోరుకున్న మార్కులు సాధించ వచ్చు అన్న ఆలోచన చేయడు.


అదేవిధంగా చాలామంది తమకు ఏర్పడిన పేదరికం గురించి ఆలోచిస్తూ నిద్రమాని తిట్టుకుంటూ కాలం గడిపేస్తారు కాని ఏ ప్రయత్నం చేస్తే తమ పేదరికం తోలిగిపోతుంది అన్న ఆలోచనలు చేయరు. వాస్తవానికి ఈ భూమి మీద పుట్టిన మనిషికి తప్ప మిగతా ఏ జీవికి తమకు ఇష్టమైన విషయాలను ఎంచుకునే శక్తి స్వేచ్చ ఉండవు. 10 వేల సంవత్సరాల క్రితం ఒక పులి ఎలా జీవించిందో నేటికి అలాగే జీవిస్తోంది.


అయితే మనిషి మాత్రం 10 వేల సంవత్సరాల క్రితం మనిషిలా లేడు. దీనికి కారణం అతడి ఆలోచనా తీరు ప్రతి విషయంలోనూ తనకు నచ్చిన విధంగా ఎంచుకునే స్వేచ్చ. అందుకే చాలామంది వేదాంతులు మన జీవితానికి విధాతలం మనమే అంటారు. మన చేతి గీతను మనమే గీసుకోవాలి మన జీవన శిల్పాలను మనమే చేక్కుకోవాలి. దీనికోసం పెద్దపెద్ద చదువులు ఉద్యోగాలు అవసరం లేదు. మనకు ప్రకృతి పరంగా ఏర్పడిన ఎంపిక శక్తిని తెలివిగా ఉపయోగించుకుని కొంచెం ఓపిక క్రమశిక్షణ ఉంటే చాలు మన సంపదను మనమే సృష్టించుకుని ఐశ్వర్యం పొందవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: