గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ సంస్థలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే ఫిబ్ర‌వ‌రి1న‌ గృహ వినియోగ వంట గ్యాస్ ధర సవరించిన రేట్ల ప్రకారం ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. గ్యాస్ సిలిండర్ ధర రూ.149 పెరిగింది. 14.2 గ్యాస్ సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది. దీంతో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. లేటెస్ట్ ధరలు ఇలా ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం.. ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.858.5కు చేరింది. 

 


ఢిల్లీలో ఈ ధర వర్తిస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.896కు చేరింది. ధర రూ.149 పెరిగింది. ముంబైలో సిలిండర్ ధర రూ.145 పెరుగుదలతో రూ.829.5కు, చెన్నైలో రూ.147 పెరుగుదలతో రూ.881కు చేరింది. 19 కేజీల సిలిండర్ ధర ఇప్పటికే పైకి కాగా 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఫిబ్రవరి 1 తేదీనే పెరిగింది. మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక షాక్ అనే చెప్పాలి. మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఇదొక గుదిబండ‌లాగా త‌యార‌యింది. గ‌తంలో 2019 న‌వంబ‌ర్‌లో గ్యాస్ ధ‌ర ఒకేసారి 76 రూపాయ‌లు పెర‌గ‌గా సెప్టెంబ‌ర్‌లో ఎల్‌పీజీ పై 15.5 పెరిగింది. ఇలా గ‌త ఆరు నెలలుగా నెలా నెలా ధ‌ర‌ పెరుగుతూ రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. 

 


ఇక గ‌త నవంబ‌ర్ నెల‌లో ఒకేసారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర 76 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగితే...ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఒక కుటుంబానికి వ‌చ్చి సంవ‌త్స‌రానికి 12 సిలిండ‌ర్ల వ‌ర‌కు స‌బ్సిడీని అందిస్తోంది. ఇంత‌క‌న్నా ఎక్కువ సిలిండ‌ర్లు బుక్ చేసే వారికి అద‌నంగా మార్కెట్ ధ‌రనే చెల్లించి తీసుకుంటున్నారు. దాని పై స‌బ్సిడీ ధ‌ర రావ‌డం లేదు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే.  దీంతో ధ‌ర అమాంతం పెర‌గ‌డంతో ఆ ప్ర‌భావం అంతా సామాన్య ప్ర‌జ‌ల పైనే ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాగే ధ‌ర పెరిగితే దాంతో పాటు జీఎస్టీ కూడా అధికంగా పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: