దేశంలోనే ది బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకోవాలని తపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ దానికనుగుణంగానే ప్రజా సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తన పాలనలో పార్టీలు, కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరికీ సమ న్యాయం జరగాలంటూ పదేపదే చెబుతున్నారు. అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ పై అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేయించారు. అక్కడితో ఆగకుండా తన ఆవేదనను వీడియో లో రికార్డ్  చేసి విడుదల చేయడం ... అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సంచలనం రేపుతోంది. 


 వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి తనకు తప్పు చేశానని, ఇక జన్మలో వైసీపీకి ఓటు వేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటానని చెబుతూ ఆగ్రహంగా మాట్లాడాడు. ఇటీవల జగన్ నిర్వహించిన మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తాను పాల్గొన్నాని, అప్పుడు జరిగిన ప్రమాదంలో తన కాలు విరిగిందని, అయినా ఏ ఒక్క నాయకుడు తనను పట్టించుకోలేదని, కనీసం పరామర్శించలేదు అంటూ తన బాధను వెళ్లగక్కాడు.  ఇటువంటి పార్టీ కోసం తాను ఎంతగానో కష్టపడ్డానని, సొంత కార్యకర్తలని పట్టించుకోని వారికీ మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని మండిపడ్డాడు. 


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై స్పందించారు. సదరు వీడియోను ప్రస్తావిస్తూ వైసీపీ పై విమర్శలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలను ఆదుకొని జగన్ గారు.. మూడు రాజధానులు నిర్మిస్తాను అనడం విచిత్రంగా ఉంది. ఆయన మాటలు కార్యకర్తలు నమ్మే పరిస్థితి లేదు అంటూ సదరు వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని వైసీపీ పై విమర్శలు చేసేందుకు టిడిపి వాడుకుంటోంది. 

https://twitter.com/naralokesh/status/1227484594951188480

మరింత సమాచారం తెలుసుకోండి: