ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.  మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

మార్చి 15వతేది కళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నికల్లో డబ్భులు, మద్యం   పంపిణీ చేసే అభ్యర్థులు దొరికితే వారిపై అనర్హత వేటు వెయ్యాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపైనా సర్వత్రా వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. దొరికిపోయిన దొంగ లెక్కన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా రాష్ట్రాన్నే వదిలేసి వచ్చేసారు.

 

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుడన్న ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నియమాలు ప్రకారం ఎవరైనా అభ్యర్థులు దొరికితే మూడు సంవత్సరాలు శిక్ష తో పాటు అనర్హత వేటు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుండి 15 రోజుల మార్చే చట్టానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీల ప్రచారం 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాలకు 7 రోజుల గడువును మాత్రమే  మంత్రిమండలి ఇచ్చింది.

 

సడెల్ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ  జడ్పీటీసీ  పోటీకి గిరిజనులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. ఎన్నికైన సర్పంచ్ ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలని నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచితే మూడు సంవత్సరాలు శిక్ష, అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: