ఢిల్లీలో ఆమ్ ఆద్మిపార్టీ (ఆప్) ఘన విజయంతో రాత్రికి రాత్రే హస్తిన రాజకీయాలు మారిపోయినట్లు సమాచారం.  ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్  62 సీట్లతో బంపర్ మెజారిటితో గెలిచింది. అదే సమయంలో  నరేంద్రమోడి, అమిత్ షా సారధ్యంలోని బిజెపి కేవలం ఎనిమిందంటే ఎనిమిది సీట్లు మాత్రమే గెలిచి ఘోర ఓటమిని మూట కట్టుకుంది. దాంతో మోడి మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి.

 

దాంతో ఇంతకాలం ముఖ్యమంత్రులను చాలా చిన్ని చూపు చూస్తున్న నరేంద్రమోడి ఒక్కసారిగా తన పంథాను మార్చుకున్నట్లు సమాచారం. అందుకనే ఢిల్లీ ఫలితాల సరళిని గమనించిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి కబురు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాల్లో ఎదురుదెబ్బ తప్పదని అర్ధమైపోయిన మోడి వెంటనే జగన్ కు అపాయిట్మెంట్ ఇచ్చి అమరావతి నుండి పిలిపించుకున్నట్లు సమాచారం.

 

ఎందుకింత అర్జంటుగా జగన్ ను పిలిపించుకున్నారు ? ఎందుకంటే జగన్ గత మూడు ఢిల్లీ పర్యటనల్లోను మోడి అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు.  పైగా అపాయిట్మెంట్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జగన్ ఢిల్లీ వచ్చి వెయిట్ చేసినా కలవటానికి ఇష్టపడలేదు.  అంటే ఇద్దరూ మాట్లాడుకునే జగన్ ను  అవమానం చేసినట్లే అనుకోవాలి.

 

ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో ఇద్దరు  వాస్తవంలోకి వచ్చారట. అందుకనే అర్జంటుగా జగన్ ను పిలిపించుకున్నారు.  వైసిపికి ప్రస్తుతం రాజ్యసభలో ఇద్దరు ఎంపిలున్నారు. రాబోయే ఏప్రిల్ మాసంలో మరో నలుగురు ఎంపిలు రాబోతున్నారు. అంటే వైసిపికి  మొత్తం ఆరుగురు ఎంపిల బలం అన్నట్లు. ఈ ఆరుగురు ఎంపిల బలం బిజెపికి చాలా అవసరం. ఇదే సమయంలో అసలు వైసిపిని మిత్రపక్షంగా మార్చుకునే ఆలోచనలో కూడా మోడి ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేమీ లేదు జగన్ రాష్ట్రప్రయోజనాలను  రాబట్టుకునేందుకే మోడిని కలవబోతున్నట్లు చెబుతున్నారు. మరి చూద్దాం మోడితో భేటిలో ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: