ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప్ర‌జాచైత‌న్య యాత్ర‌ల‌కు రెడీ అవు తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తాన‌ని చెబుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్ర జా చైతన్య యాత్రలు నిర్వహించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.  వచ్చేవారం నుంచి 45 రోజులపాటు ఇవి జరుగుతాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలపై ఈ యాత్రల్లో ప్రచారం చేస్తారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. దీనిని బ‌ట్టి మ‌రో వారంలోనే ఈ యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి.

 

అయితే, ఈ యాత్ర‌ల్లో ప్ర‌జ‌లను చైత‌న్య ప‌ర‌చాల‌ని చంద్ర‌బాబు అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ ఎదు ర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇప్పుడు స‌మ‌స్య‌లు తిష్ట‌వేశాయి. గ‌తంలో పార్టీలైన్‌ను అధిగ‌మించేందుకు ఎంతో కొంత భ‌యం, జంకు ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అధినేత మాట‌ల‌ను సైతం ల‌క్ష్య పెట్ట‌ని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. 

 

ఇక‌, అదే స‌మ‌యంలో పార్టీలో ఉంటారో ఉండ‌రో కూడా తెలియ‌ని నాయ‌కులు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో ముందు పార్టీని చైత‌న్య ప‌రుచుకోవాలంటూ.. సూచ‌న‌లు స‌ల‌హాలు అందుతున్నాయి. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపాల‌నేది బాబు వ్యూహం. అయితే, ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా చేరు వగానే ఉన్న‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే .. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా కూడా మేమున్నామ నే సంకేతాలు పంపుతోంది. 

 

ఇక‌, పింఛ‌న్లు, పేద‌ల‌కు ఇళ్లు, ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన సౌక‌ర్యాలు, ము ఖ్యంగా అవినీతి ర‌హితంగా ప్ర‌భుత్వ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ ల్లో మెజారిటీ ఆనందం వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు.. లేదా యాగీ చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వైఖ‌రి అయితే లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డం కంటే కూడా పార్టీ నేత‌ల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డం బేష్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: