తెలుగుదేశం పార్టీకి అత్యంత దరిద్రమైన స్టేజ్ ఏదంటే? అది 2019 ఎన్నికలు ఫలితాల వచ్చిన దగ్గర నుంచి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాలు దారుణంగా రావడం, ఆ తర్వాత కొందరు నేతలు పార్టీని వదిలేసి వెళ్లిపోవడం లాంటి పరిణామాలు టీడీపీకి బాగా ప్రతికూలంగా మారాయి. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోనూ టీడీపీ పరిస్తితి చాలా ఘోరంగా తయారైపోయింది. అయితే ఈ పరిస్థితుల నుంచి పార్టీని బయటపడేసేందుకు చంద్రబాబు నానా కష్టాలే పడుతూ వస్తున్నారు.

 

ఓటమి వచ్చిన వెనుకడుగు వేయకుండా జిల్లాలు జిల్లాలు తిరుగుతూ మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేశారు. ఇటు వైసీపీ ప్రభుత్వంపై కూడా పోరాటాలు చేస్తూనే వచ్చారు. అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా గట్టిగానే పోరాడుతున్నారు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలంటూ జోలె పట్టుకుని మరి ప్రజలని అర్థిస్తున్నారు.

 

అయితే చంద్రబాబు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఎక్కడైనా టీడీపీకి పాజిటివ్ పెరిగిందా? అంటే కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ పెరిగిందనే రాజకీయ విశ్లేషుకులు లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బలం పెరిగిందనే చెబుతున్నారు. రాజధాని ఉద్యమం వల్ల టీడీపీకి మైలేజ్ పెరుగుతుందని అంటున్నారు.

 

మొన్న ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 2 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీకి మంచి మెజారిటీ పెరిగిందని అంచనా వేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఊహించని విధంగా పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ స్థానాలని గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పరిస్తితులని బట్టి గుంటూరు కార్పొరేషన్‌తో పాటు, జెడ్పీ పీఠాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందనే లెక్కలు వేస్తున్నారు. మరి చూడాలి గుంటూరులో టీడీపీకి ఎంత అనుకూలం ఉందో స్థానిక సంస్థ ఎన్నికలు తేల్చేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: